Prabhas Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కానీ ఈ సినిమా పై ఇప్పటి వరకు రావాల్సిన బజ్ అయితే రాలేదు. రెగ్యులర్ ప్రభాస్ సినిమాలకు ఏ రేంజ్ లో బజ్ ఉంటుందో మనం కళ్లారా చూసాము. ఆయన ప్రతీ సినిమా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటూ ఉండేవి. కానీ ‘రాజా సాబ్’ కి ఈసారి ఆ ఛాన్స్ మిస్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయినా లెక్కలు మారుతాయేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కదలడం లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ రేపు సరికొత్త రీలీజ్ ట్రైలర్ రాబోతుంది, అది వేరే లెవెల్ లో ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. కానీ ఆ ట్రైలర్ కూడా వాయిదా పడింది, ఎప్పుడొస్తాదో తెలియదు.
ఇదంతా పక్కన పెడితే మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడిన మాటలను డీ కోడ్ చేసి చూస్తే, ఎందుకో ఆయన ఈ సినిమా ఔట్పుట్ పై సంతృప్తి గా లేడని తెలుస్తుంది. ప్రసంగం చివర్లో ‘ఈ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. మా సినిమా కూడా సూపర్ హిట్ అయిపోతే సంతోషం’ అంటూ చెప్పుకొస్తాడు ప్రభాస్. హిట్ అయిపోతే ఏంటి?, సంక్రాంతికి గట్టిగా కొడుతున్నాం అని చెప్పలేడా ప్రభాస్?, ఎందుకు అయిపోతే బాగుండును అనుకుంటున్నాడు?, ఈ సినిమా ఔట్పుట్ పై ఆయనకు సంతృప్తి లేదా?, నా ఇమేజ్ కి తగ్గ సినిమా కాదని అనుకుంటున్నాడా అని అభిమానులు డైలమా లో పడ్డారు.అంతే కాదు డైరెక్టర్ మారుతీ స్పీచ్ చూస్తే, ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ప్రసంగం గుర్తుకొచ్చింది.
సినిమా పై కావాల్సినంత హైప్ లేదు అనే విషయం మారుతి కి కూడా అర్థం అయ్యినట్టు ఉంది. అందుకే స్టేజి మీద బాగా ఎమోషనల్ అయ్యి సినిమా పై హైప్ పెంచే ప్రయత్నం చేసాడు. సినిమా ఔట్పుట్ వేరే లెవెల్ లో వచ్చిందని, ఫస్ట్ రీల్ లో ప్రభాస్ అన్న నటన చూసి ఏడుపు వచ్చేసింది అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. అంతే కాకుండా , సినిమా మిమ్మల్ని నిరాశ పరిస్తే నా ఇంటికి వచ్చేయండి అంటూ ప్రభాస్ అభిమానులకు తన అడ్రస్ ని కూడా ఇచ్చేయడం వంటివి చూస్తుంటే సినిమా పై హైప్ పెంచడం కోసం చేస్తున్న స్తంట్స్ లాగా అనిపిస్తున్నాయి. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి స్తంట్స్ అవసరమా?, ఆయన సినిమా ఎలా ఉన్నా మొదటి వీకెండ్ చూస్తారు. బాగుంటే వేరే లెవెల్ కి వెళ్తుంది, హైప్ లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ కాస్త తగ్గొచ్చేమో కానీ , బాగున్న ప్రభాస్ సినిమాని చూడకుండా ఎవరైనా ఉండగలరా?, కంటెంట్ వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు, రాజా సాబ్ విషయం లో డైరెక్టర్ మారుతీ తీరు కూడా అలాగే ఉంది.