Tirupathi Stampede : తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం టీటీడీ(TTD) టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం(జనవరి 8న) మధ్యాహ్నం టోకెన్ల జారీ ఉంటుందని తెలిపారు. అయితే సుమారు 2 వేల మంది వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ రెట్టింపు అంటే 4 వేల మంది వరు వచ్చారు. మరోవైపు సాయంత్రం వరకు టెకెన్లు జారీ చేయలేదు. దీంతో రాత్రి 7:30 గంటల వరకు వేచి ఉన్న భక్తులు అసహనంతో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ రోజు వాస్తవంగా ఏం జరిగింది అనే విషయాన్ని ఓ పోలీస్ అధికారి ఆఫ్ ది రికార్డ్‌గా వెల్లడించారు.
టోకెన్ల పంపిణీ ప్రారంభంతో..
ఉదయం నుంచి రాత్రి వరకు వేచి ఉన్న భక్తులు టెకెన్ల పంపిణీ ప్రారంమైన తర్వాత పంపించేందుకు సమీపంలోని పార్కులో ఉంచారు. పార్క్(Park) ప్రధాన ద్వారం నుంచి టోకెన్లు పంపిణీ చేసే పాఠశాలకు వెళ్లడానికి బారికేడ్ మార్గం ఏర్పాటు చేయబడింది. గేటు వద్ద డజను మంది పోలీసు సిబ్బంది ఉన్నారని ఒక అధికారి చెప్పగా, తొక్కిసలాట జరిగినప్పుడు ఆరుగురు అధికారులు మాత్రమే ఉన్నారని మరొక అధికారి తెలిపారు. ఇదే సమయంలో పార్కులో ఉన్న ఓ మహిళ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుందని సమాచారం అందడంతో పోలీసులు ఆమెను బయటకు తీసుకువచ్చి వైద్యం చేయించాలని భావించారు. ఈమేరకు వాస్తవం తెలుసుకునేందుకు పోలీస్ అధికారి ఇద్దరు కానిస్టేబుళ్లను లోపలికి పంపించారు. ధ్రువీకరించిన తర్వాత ఆ మహిళను బయటకు తీసుకురావాలని సూచించాడు. ఈ సందర్భంగా గెటే తెరవగా.. భక్తులు టోకెన్లు జారీ చేస్తున్నారని, అందుకే గేట్ ఓపెన్ చేశారని భావించారు. ఒక్కసారిగా ముందుకు పరిగెత్తుకురావడంతో తోపులాటలో చాలా మంది కిందపడిపోయారు. వారిని తొక్కుకుంటూనే మిగతా భక్తులు ముందుకు వెళ్లారు. ఈ ఘటన రాత్రి 8:20 గంటలకు జరిగింది.
నియంత్రణ కోల్పోయిన పోలీసలు..
భక్తులు పెద్ద ఎత్తున రావడం, పోలీసులు(Police) తక్కువ సంఖ్యలో ఉండడంతో నియంత్రణ కోల్పోయారు. గందరగోళం సమయంలో చాలా మంది భక్తులు నేలపై పడిపోయారు. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ, భారీ జనసమూహాన్ని నియంత్రించలేకపోయారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. అందరినీ అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. వారిలో, ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు, ’’అని ఎఫ్‌ఐఆర్ తెలిపింది.
అంబులెన్స్ ఆలస్యం..
తొక్కిసలాటతో అప్రమత్తమై కిందపడిన భక్తులను పైకి లేపే ప్రయత్నం చేశారు పోలీసులు. స్పృహ కోల్పోయన భక్తులకు సీపీఆర్(CPR) చేశారు. అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయిందని వెల్లడించార