Police Action on Ambati Rambabu : మాజీమంత్రి అంబటి రాంబాబుకు( ambati Rambabu) ఊహించని షాక్ తగిలింది. ఆయనపై పోలీస్ కేసు నమోదయింది. ఏ క్షణం అయినా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నేరానికి గాను ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అందులో భాగంగా గుంటూరులో అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు పోలీసులపై దూకుడుగా వ్యవహరించారు. వారితో వాగ్వాదానికి దిగారు. నీ అంత చూస్తానంటూ పురుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ తరుణంలోనే పోలీస్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
Also Read : కల్వకుంట్ల కవితపై రాధాకృష్ణకు ఎందుకింత కోపం! ఆంధ్రజ్యోతి మరో సంచలన కథనం!
* ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ పిలుపు మేరకు గుంటూరులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు వైసీపీ శ్రేణులు. గుంటూరు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు తన నివాసం నుంచి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్ కు బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డు చెప్పారు. అయితే కుందులు రోడ్డు జంక్షన్ లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో అంబటి రాంబాబు పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. అక్కడే ఉన్న సిఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని.. ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇం తమందికి వెళ్ళనిచ్చేది లేదని సీఐ తేల్చి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు.. ఎలా ఫోన్ ఇవ్వరో చూస్తానంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాలికి అనుమతించేది లేదని మరోసారి సిఐ స్పష్టం చేశారు. సహనం కోల్పోయిన అంబటి సీఐపై అభ్యంతరకరంగా మాట్లాడారు. సుమారు పావుగంట సేపు సిఐతో ఆయన వాదులాడారు.
* ధీటుగా బదులిచ్చిన సీఐ
అయితే అంబటి రాంబాబుకు దీటుగా సమాధానం చెప్పారు సీఐ వెంకటేశ్వర్లు( CI venkateswarlu ). మీ బెదిరింపులకు ఎక్కడ ఎవరూ భయపడరని తేల్చి చెప్పారు. ర్యాలీకి ఎలా అనుమతివ్వరో చూస్తాం అని అంబటి రాంబాబు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కచ్చితంగా అడ్డుకొని తీరుతామని సిఐ స్పష్టం చేశారు. అయితే సుమారు పావుగంట సేపు సిఐతో అదే స్థాయిలో దురుసుగా మాట్లాడుతూ వ్యాఖ్యానాలు చేశారు అంబటి. నిన్నను రోజంతా ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పై కేసు నమోదయింది. ఆయనతోపాటు వైసీపీ శ్రేణులపై బిఎంఎస్ యాక్ట్.. సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
* వైసీపీ శ్రేణుల్లో ఆందోళన..
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం( liquor scam ) కేసుల్లో వరుసగా తాజా మాజీలు అరెస్టు అవుతున్నారు. ఇంకోవైపు తిరుమల లడ్డు విచారణ కూడా తుది దశకు వస్తోంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా పోలీసులపై నోరు జారి.. అంబటి రాంబాబు ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.