Telugu movie most watched in theaters : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మన దర్శకులు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువమంది ప్రేక్షకులు చూసిన సినిమా ఏంటి అంటూ కొన్ని రోజులు వినబడుతున్నాయి. నిజానికి రాజమౌళి చేసిన సినిమా ఇండియా వైడ్ గా భారీ గుర్తింపును సంపాదించుకున్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి దర్శకుడు కూడా తనే కావడం విశేషం…ఆయన చేసిన ‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమాని 10 కోట్ల 55 లక్షల మంది థియేటర్లలో చూశారు. మొత్తానికైతే ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 1800 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక తెలుగువాడు సినిమా చేస్తే ఎలా ఉంటుందో దేశం మొత్తం చాటి చెప్పింది. అలాగే బాలీవుడ్ హీరోలకి సైతం గట్టి పోటీని అయితే ఇచ్చిందనే చెప్పాలి…
ఇక ఈ సినిమాని బీట్ చేస్తూ ఇప్పటివరకు ఏ సినిమాని కూడా ప్రేక్షకులు ఈ రేంజ్ లో థియేటర్లలో అయితే చూడలేదు కాబట్టి ఈ సినిమాకి హైయెస్ట్ దక్కిందని చెప్పాలి మొత్తానికి అయితే ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తారా స్థాయికి వెళ్ళిపోయింది ఇకమీదట రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా తో ఈ రికార్డును బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
పాన్ వరల్డ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకుంటే మాత్రం ఈజీగా ఈ రికార్డును బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి వచ్చిన త్రిబుల్ ఆర్ (RRR) సినిమా కూడా రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
ఒక్కడే ఈ రికార్డును బ్రేక్ చేయగలడా? లేదంటే ఇతర దర్శకులు కూడా ఈ సినిమా రికార్డును బ్రేక్ చేయగలిగే కెపాసిటి ఉందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం ఇక మీదట చేయగలిగే సినిమాలతో భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…