Polavaram Project Latest Updates 2026: పోలవరం ప్రాజెక్టు( polavaram projects ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు జరిపిస్తోంది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను నిలిపివేశారు. అసంబద్ధ నిర్ణయాల వల్ల వరదలకు పాత డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. దాదాపు రూ.1000 కోట్ల ప్రజాధనం వృధా అయ్యింది. ప్రాజెక్టు ఉనికికే ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు జరిపి.. కేవలం 21 నెలల స్వల్ప వ్యవధిలోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో కీలక ఘట్టంగానే భావించాలి.
* నిరంతర సమీక్ష..
గతంలో టిడిపి ప్రభుత్వం( TDP government) వచ్చినప్పుడు కూడా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పోలవరం పనులను సమీక్షించేవారు. ఈసారి కూడా అదే పని చేస్తున్నారు. స్వయంగా ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ.. ఇంజనీర్లను పరుగులు పెట్టించడం వల్లే ఈ అసాధ్యం సుసాధ్యమైంది. తక్కువ కాలంలోనే డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో.. ప్రాజెక్టు ప్రధాన న్యాయ నిర్మాణం పూర్తి చేయడానికి మార్గం సుఖమమైంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఐదేళ్లపాటు వెనక్కి వెళ్లిపోయింది. చంద్రబాబు తన అనుభవంతో ఆ కాలాన్ని భర్తీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా సక్సెస్ అయ్యారు కూడా.
* పుష్కర సమయానికి మొదటి దశ..
గోదావరి పుష్కర( Godavari festivals ) సమయానికి పోలవరం ప్రాజెక్టు ఒకటో దశ పనులు పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు పోలవరం జలాలతో అభిషేకం చేయాలనే సంకల్పంతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూ సేకరణ, పునరావాస పనులకు నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకుంటున్నారు. 2026 చివరి నాటికి ప్రధాన పనులన్నీ పూర్తిచేసి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తీర్చాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాపంగా మారిన పోలవరం.. చంద్రబాబు పాలనలో మళ్లీ వరంగా మారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవస్థలను వంశం చేయడం సులభం.. దెబ్బతిన్న వ్యవస్థలను నిర్మించడం చాలా కష్టం అని ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం తేల్చి చెప్పింది. మొత్తానికైతే పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇదో మంచి శుభ పరిణామమే…
