PM Modi comments on NTR and Chandrababu: తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు( Nanda Mori tarakka Rama Rao) . వెండితెర ఇలవేల్పుగా ఉన్న ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రభంజనం సృష్టించారు. ఢిల్లీ రాజకీయాలనే షేక్ చేశారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక చరిత్ర క్రియేట్ చేసుకున్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అధిపత్యానికి గండి కొడుతూ ఏపీలో అధికారంలోకి రాగలిగారు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటుతున్నా.. ఇప్పటికీ ఏపీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలుస్తూ వచ్చారు. అటువంటి మహానీయుడు జయంతి ఈరోజు. కడపలో మహానాడు జరుగుతుండగా.. రాష్ట్రం తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
* ప్రముఖుల నివాళి
ఎన్టీఆర్( NTR) జయంతి సందర్భంగా ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆయనకు నివాళి అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ కు రానున్నందున అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్ననే మహానాడు ప్రారంభోత్సవంలో నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ చిత్రాలతో నింపేశారు. ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని, ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడుతూ నేతల ప్రసంగాలు కొనసాగాయి. ఈరోజు రెండో రోజు ప్రతినిధుల సభ జరగనుంది. తొలిరోజు ప్రవేశపెట్టిన తీర్మానాలను నేడు సభ ఆమోదించనుంది. చివరి రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. కాగా సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ మహానాడు ప్రాంగణంలోనే బస చేశారు.
Also Read: AP New Pension Update: ఏపీలో పెన్షన్ పంపిణీలో మార్పు.. ఆరోజు ఇవ్వరు!
* మోదీ, పవన్ స్పందన..
మహానాడు పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మహానాడు అనే పదంలో ఒక వైబ్రేషన్ ఉందని కొనియాడారు. ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం చర్చించే వేదికగా మహానాడును తీర్చిదిద్దడం పై అభినందించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఈరోజు స్పందించారు. సమాజ సేవకు, అణగారిన వర్గాలకు సాధికారిక కల్పించడానికి ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు.. తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు. సినిమాల ద్వారా యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోడీ చెప్పారు. సమాజంలో స్ఫూర్తిని నింపే సినిమాలు తీసారని గుర్తు చేశారు. తామంతా ఎన్టీఆర్ నుంచి ఎంతో ప్రేరణ పొందామని పేర్కొన్నారు. తన స్నేహితుడు, ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ.
I pay homage to NTR Garu on his birth anniversary. He is widely admired for his efforts to serve society and empower the poor and downtrodden. His cinematic works also continue to enthral audiences. We are all deeply inspired by him.
The NDA Government in Andhra Pradesh, led by…
— Narendra Modi (@narendramodi) May 28, 2025