PM Awas Yojana Urban 2.0: కొత్త ఇల్లు కట్టుకోవాలని ఎవరైనా కలలు కంటూ ఉంటారు. అయితే సరైన ఆదాయం లేకపోవడంతో చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో సంస్థలు, బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి. అయితే ఈ రుణాలు చెల్లించాలంటే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి ఈఎంఐ లో చెల్లించలేక అవస్థలు పడుతూ ఉంటారు. దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపింది. కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి రూ. 1,80,000 రూపాయలను అందిస్తుంది. అయితే ఈ మొత్తాన్ని పొందాలంటే ఏం చేయాలంటే?
Also Read: చంద్రబాబుపై వ్యతిరేకత లేదు.. జగన్ పై సానుకూలత లేదు.. ఎందుకిలా!
ఇల్లు కట్టుకునేవారు లేదా కొనుగోలు చేసేవారు బ్యాంకు రుణానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బులు లేని వారు ఉన్నవారు సైతం బ్యాంకు రుణం తీసుకొని నెలనెలా ఈఎంఐ చెల్లిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద సబ్సిడీని అందించిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా కొత్తగా ఇల్లు కట్టుకునేవారు రూ. 1,80,000 పొందవచ్చు. వీటిని పొందడానికి కొన్ని నియమాలను రూపొందించింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం పొందడానికి ఇల్లు కట్టుకునేవారికి అర్బన్ ఏరియాలో స్థలం ఉండాలి. వీరు 9 లక్షల వార్షిక ఆదాయాన్ని మించకూడదు. అలాగే ఇప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ ఇల్లు తీసుకున్న వారి ఉండకూడదు. అయితే వీటిని పొందడానికి కొన్ని ప్రక్రియలు చేపట్టాల్సి ఉంటుంది. సాధారణంగా గృహం నిర్మించుకునేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో రూ. 1,80,000 కు సంబంధించిన దరఖాస్తులు పూర్తి చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. వ్యక్తికి సంబంధించిన అన్ని అర్హతలు ఉంటే 1,80,000 బ్యాంకు రుణంలో యాడ్ చేస్తారు. ఇవి కలిపిన తర్వాత ప్రిన్సిపుల్ అమౌంటు తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వాటిపై వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది.
Also Read: బాంబ్ బ్లాస్ట్ జరిగినా భూటాన్ పర్యటన ఆగలేదు.. మోధీ మొండి ధైర్యం ఏమిటి?
ఈ విధంగా ఇల్లు కట్టుకునేవారు బ్యాంకు రుణం తీసుకుంటే రూ. 1,80,000 ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే ఈ పథకం పొందడానికి గ్రామీణులు అర్హులు కాదు. కేవలం అర్బన్ ఏరియాలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆన్లైన్లోనూ వెబ్సైట్ ద్వారా కూడా దీనిని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధించిన సరైన పత్రాలతో పాటు ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ వంటివి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునేవారు దీనిని ప్రయోజనం పొందడం ద్వారా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈఎంఐ భారం కూడా తగ్గి ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు.