Case against Perni Nani son: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలు దూకుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కృష్ణాజిల్లాలో అధికార పార్టీపై దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అందులో పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మీడియా ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంతటితో ఆగకుండా మంత్రుల పర్యటనను సైతం అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మచిలీపట్నంలో పర్యటనకు వస్తే అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. కొందరు పోలీసులు వైసీపీ నేతలతో చేతులు కలిపి ఇటువంటి చర్యలకు దిగుతున్నారని టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ అల్లర్లు సృష్టించే ప్రయత్నం వెనుక పేర్ని కిట్టు సూత్రధారి అని ఫిర్యాదు చేశారు. టిడిపి నేతల ఫిర్యాదు మేరకు కిట్టు తో పాటు 19 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
పతాక స్థాయికి వైరం..
మచిలీపట్నంలో( Machilipatnam) రాజకీయ వైరం పతాక స్థాయికి చేరింది. మాజీ మంత్రుల్లో ఇప్పుడు దూకుడుగా ఉన్నది పేర్ని నాని. ప్రస్తుతం ఆయన కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయనకు మచిలీపట్నంలో రాజకీయ ప్రత్యర్థిగా మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. గతంలో కొల్లు రవీంద్రను టార్గెట్ చేసుకున్నారు పేర్ని నాని. ఇప్పుడు మంత్రిగా రవీంద్ర మారడంతో పేర్ని కుటుంబం టార్గెట్ అయింది. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం పక్కదారి కేసులో పేర్ని కుటుంబం పై పట్టు బిగించేందుకు రవీంద్ర ప్రయత్నం చేశారు. అయితే కోర్టుకు వెళ్లి ఉపశమనం పొందారు పేర్ని నాని. కానీ ఇటీవల నారా లోకేష్ తో పాటు కొల్లు రవీంద్ర పై విరుచుకు పడుతున్నారు పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు.
Also Read: AP elections update: ఓట్ల గోల్ మాల్: ఏపీ ఎన్నికలు రద్దు?
మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ ఫైట్..
మొన్నటి ఎన్నికల్లో పేర్ని నాని( Nani ) తప్పుకున్నారు. తన కుమారుడు కిట్టును వైసీపీ అభ్యర్థిగా బరిలోదించారు. అయితే కొల్లు రవీంద్ర చేతిలో కిట్టు దారుణ పరాజయం చవిచూశారు. అయితే రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పేర్ని నాని భార్యపై కేసు నమోదు అయింది. ఆమె అరెస్ట్ కూడా జరుగుతుందని అంత అనుమానించారు. విచారణ పేరిట ఆమెను ఇబ్బంది పెట్టారని.. తనకు ఆత్మహత్య చేసుకునేలా అవమానించారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ వచ్చిన నాటి నుంచి పేర్ని నాని దూకుడు పెంచారు. వల్లభనేని వంశీ అరెస్ట్, గుడివాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. మరోవైపు పేర్ని నాని కుమారుడు కిట్టు సైతం ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి సంచలనంగా మారుతున్నాయి.
హోం మంత్రి అనిత పర్యటన..
మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వచ్చేందుకు హోంమంత్రి అనిత( home minister Anita) షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. అయితే ఆమె పర్యటనలు వైసీపీ శ్రేణులు అల్లర్లు సృష్టించాలని భావించారని టిడిపి శ్రేణులు అనుమానించాయి. మరోవైపు శాంతిభద్రతల దృష్ట్యా హోంమంత్రి అనిత మచిలీపట్నం పర్యటన రద్దు అయ్యింది. అయితే వైసిపి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాల వెనుక పేర్ని కిట్టు ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే టిడిపి శ్రేణుల ఫిర్యాదు మేరకు కిట్టు తో పాటు మరో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కొంతమంది పోలీసులే వైసిపి శ్రేణులకు పరోక్ష సహకారం అందిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో హోం శాఖ మంత్రి శాఖా పరమైన విచారణకు ఆదేశించినట్లు సమాచారం.