People Returning to Ancestral Village: వందల సంవత్సరాల కిందట వారు వలస పోయారు. కానీ తమ వంశవృక్షం ఎక్కడ ఉందో తెలుసుకున్నారు. మూలాలు వెతుక్కుంటూ స్వగ్రామాలకు చేరుకున్నారు. వారిని చూసిన బంధువులు, సొంత కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారు. కోయంబత్తూరు నుంచి ప్రకాశం జిల్లా ఉలిచి కి వచ్చిన వందల కుటుంబాల వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు గ్రామస్తులు. నూతన వస్త్రాలు అందించి సత్కరించారు ఉలిచి గ్రామస్తులు. ఎప్పుడో వందల ఏళ్ల కిందట వెళ్లిపోయిన తమ వారిని చూసి మురిసిపోయారు.
వందల సంవత్సరాల కిందట వలస..
ప్రకాశం జిల్లా( Prakasam district ) ఉలిచికి చెందిన వందల సంఖ్యలో కుటుంబాలు కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూర్, తిరుపూర్, మధురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నెలల్లో తోలుత వ్యవసాయం చేయడం ప్రారంభించారు. సాగు ను లాభ సాటిగా మార్చారు. వ్యాపారాల్లో ప్రవేశించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఉన్నత స్థానాలకు ఎదిగారు. తమిళ సంస్కృతిని అలవాటు చేసుకున్నారు కానీ.. పాము తెలుగు వారం అన్న విషయాన్ని మాత్రం వారు మరిచిపోలేదు. అందుకే తమ పూర్వీకుల మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. ఒంగోలు రూరల్ మండలం ఉలిచి గ్రామంలో తమ మూలాలు ఉన్నట్లు తెలుసుకోగలిగారు. తమ పూర్వీకులు అక్కడి వారేనని నిర్ధారించుకున్నారు. ఈ విషయం ఉలిచి గ్రామస్తులకు తెలియడంతో వారు ఎంతగానో ఆనందపడ్డారు. తమ వారిని ఆత్మీయంగా ఆహ్వానం పలికారు. అలా ఓ 15 మంది ఇటీవల ఉలిచి కి వచ్చారు. దీంతో గ్రామస్తులు వారికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చి నూతన వస్త్రాలు బహూకరించారు.
Also Read: చివరికి కొడాలి నాని చేత చెప్పిస్తున్న జగన్!
విజయనగరం సామ్రాజ్యంలో..
ఒంగోలు( Ongole) తోపాటు ఉలిచి ప్రాంతానికి చెందినవారు విజయనగర సామ్రాజ్యంలో సైనికులుగా, ఆస్థానంలో కీలక ఉద్యోగులుగా పని చేసేవారట. అయితే కార్యక్రమంలో వారంతా దక్షిణ తమిళనాడుకు వలస పోయారు. వందల సంవత్సరాల కిందటే అక్కడ స్థిరపడ్డారు. కానీ తెలుగు సంప్రదాయ పండుగలను, ఉగాది నాటి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునే వారు. అచ్చం తెలుగు సంస్కృతి మాదిరిగా నడుచుకునేవారు. అయితే కోయంబత్తూర్ ప్రాంతంలో తెలుగువారి ప్రభావం అధికం. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాల్లో ఎక్కడి వారు స్థిరపడ్డారు కూడా. ఆ ప్రాంతంలో తమిళం తో పాటు తెలుగు మాట్లాడేవారు అధికంగా కనిపిస్తారు. కోయంబత్తూర్ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సైతం తెలుగు మాట్లాడేవారు అధికంగా ఉంటారు. అందుకే ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు సైతం తెలుగు ప్రజల పట్ల చాలా అభిమానం చూపుతారు.
వస్త్ర పరిశ్రమల ఏర్పాటు.. తమిళనాడులోని( Tamil Nadu ) తిరుపూర్ ప్రాంతంలో వస్త్ర పరిశ్రమలు ఎక్కువ. అయితే వాటిని ఎక్కువగా తెలుగువారే ఏర్పాటు చేశారు. తొలుత జనపనార పరిశ్రమలు ఉండేవి. నల్లరేగడి నేల కావడంతో పత్తి సాగు అధికం అయింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ వస్త్ర పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. తెలుగు మూలాలు ఉన్న గోపాల స్వామి దొరై స్వామి నాయుడు అలియాస్ జీడి నాయుడు పారిశ్రామికవేత్తగా గొప్ప గుర్తింపు సాధించారు. ఇటీవల జీడి నాయుడు విగ్రహాన్ని కోయంబత్తూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. ఆ నగరంలో ముఖ్యమైన ఫ్లైఓవర్కు ఆయన పేరు పెట్టారంటే ఎంత ఖ్యాతి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక ప్రాంతానికి వెళ్లి.. అక్కడి సంస్కృతిలో భాగమైన తర్వాత కూడా తమ మూలాలను వెతుక్కుంటూ రావడం నిజంగా గొప్ప పరిణామం.