Peddireddy Midhun Reddy: మద్యం కుంభకోణం( liquor s cam) కేసులో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పాత్ర పై ఈడి అనేక సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో ఏపీలో సిట్ జరుగుతున్న విచారణ అంశాలను తన వద్ద పెట్టుకుని ఈడీ ప్రశ్నించేసరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. ముందు రోజే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇది ఎదుటకు హాజరయ్యారు. ఆ మరుసటి రోజే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఈడి ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ తో పాటు తమ దర్యాప్తులోను వెల్లడైన అంశాలను దగ్గర పెట్టుకుని ప్రశ్నించినట్లు తెలిసింది.
* సుదీర్ఘ విచారణ..
దాదాపు 6 గంటల పాటు ఈడీ( enforcement director rate ) విచారణ సాగినట్లు తెలుస్తోంది. వైసిపి హయాంలో మద్యం పాలసీ రూపకల్పనలో మిధున్ రెడ్డి పోషించిన పాత్ర, ఆయన భాగస్వామిగా ఉన్న ఇతర వ్యాపార సంస్థల లావాదేవీల వివరాలను విచారణలో ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని 100 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు సాయి రెడ్డి ప్రస్తావన తీసుకొస్తూ 100 కోట్లు ఎందుకు ఆయనను అడిగారని కూడా ప్రశ్నించినట్లు టాక్ నడుస్తోంది. తద్వారా బలమైన ఆధారాలను ఈడి సేకరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
* అసలు సూత్రధారిగా ఆధారాలు..
మద్యం కుంభకోణం కేసులో మొత్తం వ్యవహారం నడిపించింది రాజ్ కసిరెడ్డి( raj kasireddy ) అయినా.. సింహభాగం ఆర్థిక ప్రయోజనాలు పొందింది మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అని ఆరోపణలు ఉన్నాయి. డిస్టలరీలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, మద్యం కంపెనీలను వశపరచుకోవడం.. ఇలా అన్నింటి వెనుక పెద్దిరెడ్డి పాత్ర ఉందని స్పష్టమైన ఆధారాలు ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మరింత ప్రమాదంలో పడినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే ఈ కేసులో అరెస్టై సుదీర్ఘకాలం రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు మిధున్ రెడ్డి. అందుకే ఇప్పుడు ఈ డి అరెస్టు చేస్తుందా? అన్నది అనుమానమే. అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తెలుసుకునే పనిలో ఉంది. మరోవైపు కేంద్ర సంస్థ ఈడీసైతం ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసులో సీరియస్ నెస్ మరింత పెరిగింది.