Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: పవన్ అసహనం.. చంద్రబాబు ట్రీట్మెంట్.. వైసీపీలో టెన్షన్

CM Chandrababu: పవన్ అసహనం.. చంద్రబాబు ట్రీట్మెంట్.. వైసీపీలో టెన్షన్

CM Chandrababu: సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దులు దాటితే ఏ పరిస్థితి ఉంటుందో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా విభాగానికి అర్థమైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి సోషల్ మీడియా విభాగం విశేష సేవలు అందించింది. అయితే ప్రజల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడిన సోషల్ మీడియా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వరూపం చూపింది. జగన్ ఎవరైనా విమర్శించినా, వ్యతిరేకంగా మాట్లాడినా వెంటాడింది. వేటాడినంత పని చేసింది. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు ప్రయత్నించింది.చివరికి వారి ఇంట్లో కుటుంబ సభ్యులు,మహిళలను సైతం బయట పెట్టింది.వ్యక్తిత్వ హననానికి దిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరంపర కొనసాగింది.చివరకు డిప్యూటీ సీఎం పవన్ అసహనం వ్యక్తం చేయడంతో పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. సీఎం చంద్రబాబు సైతం తనదైన ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. దాని ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేసులు.అదే స్థాయిలో అరెస్టులు కూడా.

* సైన్యాన్ని నడిపిన సజ్జల
గత ఐదేళ్లుగా సోషల్ మీడియా బాధ్యతలను చూసుకున్నారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణారెడ్డి ఏకంగా వైసీపీ ప్రభుత్వంలో రెండో స్థానాన్ని ఆక్రమించారు. పార్టీపై కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. తన కుమారుడికిసోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.అధికార మదంతో సజ్జల భార్గవ్ రెడ్డి వేలాదిమంది సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యర్థులను వెంటాడారు.చంద్రబాబు,లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటుకీలక నేతలపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టించేవారు.చివరకు ఇంట్లో మహిళలను సైతం విడిచిపెట్టలేదు.అందుకే పవన్ తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో బాధితులుగా మారారని.. రోధించిన సందర్భాలు కూడా ఉన్నాయని.. అందుకే సోషల్ మీడియా పై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని చెప్పడంతో సీరియస్ యాక్షన్ లోకి దిగింది కూటమి ప్రభుత్వం. దాని ఫలితంగానే సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి.

* పరిస్థితి సీరియస్
ఏకంగా సజ్జల భార్గవ్ రెడ్డి పై కేసు నమోదు అయిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ప్రతినిధి అర్జున్ రెడ్డి పై సైతం కేసు నమోదు అయింది. ఆయన అరెస్టు తప్పదని కూడా తెలుస్తోంది. ఈ ముగ్గురిపై జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలోనే కేసు నమోదు కావడం విశేషం. జగన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే తనను కులం పేరిట దూషించారని ఓ దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులుకఠిన సెక్షన్లు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి,వర్ర రవీందర్ రెడ్డి లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. దీంతో చంద్రబాబు తనదైన ట్రీట్మెంట్ ప్రారంభించినట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular