Pawan Riding Bicycle: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను( AP deputy CM Pawan Kalyan) అబ్బురపరిచాడు ఓ యువకుడు. బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అతి తక్కువ ఖర్చుతో దానిని అందుబాటులోకి తెచ్చాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగు చూడడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. స్వయంగా ఆ సైకిల్ ను తొక్కి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడి అద్భుత ప్రతిభకు ప్రోత్సాహంగా లక్ష రూపాయలను అందించారు. పవన్ కళ్యాణ్ పిలిచి మరి అభినందించడం విశేషం.
విజయనగరం జిల్లా కుర్రాడి ప్రతిభ..
విజయనగరం జిల్లా( Vijayanagaram district ) జాడవారి కొత్తవలస కు చెందిన రాజాపు సిద్దు ఇంటర్ చదువుతున్నాడు. తమ గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం పట్టణంలో ఓ కళాశాలలో చదువుతున్నాడు సిద్దు. మారుమూల గ్రామం కావడంతో బస్సు సౌకర్యం కూడా అంతంత మాత్రమే. దీంతో కాలేజీకి వెళ్లేందుకు అసౌకర్యానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో వినూత్న ఆలోచన చేశాడు. తనకున్న సైకిల్ కు బ్యాటరీని అమర్చి.. సరికొత్త వాహనాన్ని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఇంటి నుంచి కాలేజీకి చేరుకుంటున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో జనసేన నేతల ద్వారా ఆ కుర్రాడిని రప్పించారు.
*బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
•వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు @PawanKalyan
గారు
•రూ. లక్ష ప్రోత్సాహకం అందజేత#PawanakalyanAneNenu pic.twitter.com/7opv2IYjOV— JANASENAPARTY KURNOOL (@kurnool_jsp) July 9, 2025
పవన్ అభినందన కు ఫిదా
స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించేసరికి సిద్దు( Sidhu ) ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా హత్తుకొని.. సిద్దు నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. సైకిల్ ని ఎలా తయారు చేసావు? ఆ ఆలోచన ఎలా వచ్చింది? బ్యాటరీ అమర్చేందుకు ఎంత ఖర్చు అయ్యింది? అనే వివరాలను తెలుసుకున్నారు. స్వయంగా సైకిల్ ని తొక్కి.. వెనుక సిద్దును ఎక్కించుకున్నారు. అనంతరం ఆత్మీయంగా సత్కరించి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పిఠాపురంలో పురోహితుడి సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్ గారు@PawanKalyan pic.twitter.com/JKr6w6Pw9m
— గోదావరి జనసైన్యం (@Ewjanasainyam) April 22, 2024