Pawankalyan Vs YS Jagan : జనసేనాని పవన్ ఏపీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారిన ప్రతిసారి వినిపించే గోల మూడు పెళ్ళిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్. ఈ గోలపై ఎప్పటికప్పుడు పవన్ కౌంటర్ అటాక్ చేస్తున్నా వైసీపీ బ్యాచ్ లో ఏ మాత్రం మార్పులేదు. చివరకు సాక్షాత్ సీఎం జగన్ సైతం అవే రకమైన ఆరోపణలు చేస్తుండడం వెగటు పుట్టిస్తోంది. వ్యక్తిగత హననం వద్దూ అంటూ పవన్ ఎన్నోసార్లు వారించినా వినడం లేదు. పవన్ పై విమర్శలు చేయడానికి ఏవీ లేవన్నట్టు ఆయన వైవాహిక జీవితంపై పడుతున్నారు. రోజుకు రూ.2 కోట్లు సంపాదించే కెపసిటీ తనదంటూ చెబుతున్న ప్యాకేజీ స్టార్ అని ముద్ర వేసేందుకు తపన పడుతున్నారు.
వారాహి యాత్రలో వైసీపీ నేతలతో పాటు సీఎంను టార్గెట్ చేసుకుంటూ పవన్ ప్రసంగాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడంతో వైసీపీ బ్యాచ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అందుకే జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శలకే ప్రయారిటీ ఇస్తున్నారు. చివరకు వారాహి వాహనంపై సైతం చిర్రుబుర్రులాడారు. దానిని లారీతో పోల్చారు. దానిపై నిల్చొని పూనకం వచ్చేలా మాట్లాడుతున్నారంటూ పవన్ పై సెటైర్లు వేశారు. అతడిలా వైవాహిక జీవితంతో రోడ్డున పడలేనని.. నాలుగు నెలలకు ఒక భార్యను మార్చలేనంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. విభిన్నమైన కామెంట్స్ తో హోరెత్తిస్తున్నాయి.
అయితే దీనిపై జన సైనికులు స్ట్రాంగ్ గా రియాక్డవుతున్నారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకుంటామా అంటూ నేరుగా సీఎం ఫ్యామిలీనే ఇందులోకి లాగుతున్నారు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, షర్మిళ ఫొటొలు పెట్టి ..మరి మీ ఫ్యామిలీ గురించి ఏమంటావు హన్నయ్య అంటూ వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. రాజారెడ్డి ఏకపత్నీవ్రతుడా.. మీ బాబాయ్ వివేకానందరెడ్డి ఒక భార్యతో సరిపెట్టుకున్నాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. షర్మిళ ఫొటొను పెట్టి ఎటువంటి కామెంట్ చేయడం లేదు. పవన్ పై అంతకు మించి విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోబోమని మాత్రం హెచ్చరిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ, జనసేనల మధ్య వైవాహిక బంధాలపై పెద్ద వారే నడుస్తోంది. అయితే అన్ని అంశాలపై పవన్ క్లారిటీ ఇచ్చారని.. మీరు ఇవ్వగలరా? అని ప్రశ్నించేసరికి వైసీపీ సోషల్ మీడియా నుంచి ఉలుకూ పలుకూ లేకుండా పోతోంది.