Modi Vizag Tour- Pawan Kalyan: జరిగింది మంచికే.. జరగబోయేది మన మంచికే. జీవితంలో తరచూ వినిపించే మాట ఇది. మనిషికి బాధ, సంతోషం ఎదురైనప్పుడు శ్రేయోభిలాషులు ఇదే మాటను చెబుతుంటారు. ఇందులో సత్యం, నీతి ఉంది కాబట్టే ఈ పదం కలకాలం నిలిచిపోయింది. ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి పవన్ కు ఈ పదం అచ్చుగుద్దినట్టు సరిపోయింది. జనసేన ఒక పార్టీయేనా అని ఎగతాళి చేశారు. జనసేన ఒక మోస్తరు పార్టీయేనని తరువాత క్రమంలో ఒప్పుకున్నారు. ఇప్పుడు జనసేన కూడా యాక్టివ్ పొలిటికల్ పార్టీగా గుర్తించడం ప్రారంభించారు. అసలు జనసేన లేని ప్రభుత్వాన్నిఊహించుకోలేమని విశ్లేషిస్తున్నారు. నాడు పీఆర్పీ నేర్పిన గుణపాఠాలతో ముందుకు సాగుతున్నారు పవన్. అయితే ఆయనకు ఎదురవుతున్న పరిణామాలన్నీ శుభసూచికంగా కనిపిస్తున్నాయి. ఏది జరిగిన మన మంచికేనన్న మాట గుర్తుకు తెస్తున్నాయి.

విశాఖలో ప్రధాని పర్యటనకు అసలు పవన్ కు ఆహ్వానముండదని అధికార వైసీపీ తేల్చేసింది. మేము నిర్వహిస్తున్న కార్యక్రమం.. పవన్ కు ఏంపని అన్నట్టు వ్యవహరించింది. కానీ వారు అనుకున్నదొకటి.. అయ్యిందొకటి. పవన్ కు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. విశాఖకు వచ్చి ప్రధానిని నేరుగా కలవాలన్నదే దాని సారాంశం. అందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్ రానున్నారు. నేరుగా ప్రధాని బస చేసే చోటుకు వెళ్లి చర్చలు జరపనుర్శించి ఆదేశాలిచ్చారు. కానీ నెల తిరక్క ముందే అదే ప్రభుత్వం, అదే పోలీసులు, అదే ఎస్కార్టు వాహన శ్రేణి నడుమ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని వద్దకు తీసుకెళ్లనున్నారు. ఇది కదా వ్యూహమంటే.

నన్ను టచ్ చెయ్యొద్దని నాడు పవన్ స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. దాని పర్యవసానమే ఇది అంటూ జన సైనికులు వైసీపీ పై కౌంటర్లు ప్రారంభించారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తోరణాలు, బ్యానర్లు కట్టి తాము స్వాగత ఏర్పాట్లు చేస్తుంటే.. ప్రధాని నేరుగా పవన్ కు అతిథ్యమివ్వడానికి పిలవడంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టనట్టు చేసింది. ఏదైనా ఆడు తెలివైనోడ్రో బుజ్జి అన్న సినిమా డైలాగు గుర్తు తెచ్చుకోవడం వైసీన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి వేదిక పంచుకోవడం గొప్ప.. ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడడం గొప్ప అని ఇప్పుడు జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై ఎలా స్పందించాలా తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడిపోతున్నారు.
సరిగ్గా నెల రోజులైనా కాలేదు కదా.. అందుకే విశాఖ ఎపిసోడ్ ఘటన వైసీపీ నేతలకు దర్శనమిస్తోంది. నాడు విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులపై జనసేన శ్రేణుల దాడిని సాకుగా చూపుతూ పవన్ ను కట్టడి చేశారు. హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. నోటీసులిచ్చి మరీ ఊరు దాటించారు. వాహనంలో బయటకు కనిపించకుండా ఉండాలని మరీ కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదపీ శ్రేణుల వంతైంది.