ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్..

Pawan Kalyan: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్..

Pawan Kalyan: ఏపీలో రేపు కూటమి ప్రభుత్వం కొలువు దీరనుంది. కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అందులో భాగంగా కూటమిలోని పార్టీల శాసనసభ పక్ష నేతల ఎన్నిక ముందుగా పూర్తి చేయనున్నారు. తరువాత కూటమి పక్ష నేతగా చంద్రబాబును లాంఛనంగా ఎన్నుకోనున్నారు. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యారు. కాసేపట్లో టిడిపి ఎల్పీ, బీజేఎల్పి నేత ఎన్నిక జరగనుంది.

ఈరోజు ఉదయం జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ పేరును జనసేన శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించారు. దీనిని ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా బలపరిచారు. దీంతో ఆయన శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొద్ది సేపట్లో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. చంద్రబాబు ఎన్నిక లాంచనమే. అటు బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎవరు ఎన్నికవుతారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఆ పార్టీ నుంచి సీనియర్ నేతలు సుజనా చౌదరి, విష్ణు కుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి శాసనసభాపక్ష నేతగా అవకాశం దక్కనుంది.

రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో.. కూటమి పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఎన్డీఏ కూటమి నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి తరుపున చంద్రబాబు, పవన్, బిజెపి నేతలు కలిసి గవర్నర్ కు మద్దతు లేఖలను అందిస్తారు. దీంతో రేపు ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version