https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ పర్యటనకు బ్రేక్.. హెలిక్యాప్టర్ ల్యాండింగ్ కు అనుమతించని సర్కార్

Pawan Kalyan తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. మరోవైపు బిజెపి సైతం కలిసి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించాలని భావించారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 14, 2024 / 11:49 AM IST
    Follow us on

    Pawan Kalyan: జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచార సభలు వాయిదా పడ్డాయి.బుధవారం నుంచి ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమయ్యారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుసగా పర్యటించాలని భావించారు.అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సడన్ గా పవన్ టూర్ షెడ్యూల్ రద్దయింది. పర్యటన వాయిదా పడింది.దీంతో జనసేన శ్రేణులు నిరాశకు గురయ్యాయి.ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పవన్ భీమవరం నుంచి తన పర్యటనను ప్రారంభిస్తారని జనసేన నాయకత్వం ప్రకటించింది. ముందుగా తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేస్తారని..తరువాత మిగతా ప్రాంతాల్లో తిరగనున్నారని చెప్పుకొచ్చారు.కానీ ఇప్పుడు ఉన్నఫలంగా ఈ షెడ్యూల్ రద్దయింది.. త్వరలో రాష్ట్ర పర్యటనలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తామని జనసేన నాయకత్వం చెబుతోంది. ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతోనే పవన్ పర్యటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది

    తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. మరోవైపు బిజెపి సైతం కలిసి వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించాలని భావించారు. టిడిపి శ్రేణులతో సమన్వయం, జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో స్పష్టతనివ్వడం..తదితర అంశాలతో పవన్ పర్యటన సాగుతుందని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. అటు రాష్ట్ర పర్యటనలకు పవన్ ప్రత్యేక హెలికాప్టర్ సైతం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికల రెండు నెలల్లో 175 నియోజకవర్గాలను టచ్ చేస్తూ పవన్ కార్యక్రమాలను రూపొందించినట్లు సమాచారం.అయితే సాంకేతిక కారణాలతో జనసేన అధినేత పవన్ పర్యటన షెడ్యూల్ వాయిదా పడింది.

    భీమవరం నుంచి పర్యటనలు ప్రారంభించాలని పవన్ భావించారు. అయితే దానికి ఆర్ అండ్ బి అధికారులు అడ్డుకున్నారు. జగన్ సర్కార్ వైఖరితోనే అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించి అనుమతులు ఇవ్వట్లేదని.. అందువల్లే పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నట్లు జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ట్విట్ చేశారు. దీన్నే జనసేన అధికారిక ఎక్స్ అకౌంటు రీ ట్విట్ చేసింది. దీంతో పవన్ పర్యటన వాయిదా పడింది అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్టు అయ్యింది. కేవలం హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి ఇవ్వట్లేదు అన్న కారణంతో పవన్ పర్యటన వాయిదా పడడాన్ని జనసేన శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. ఎన్నికల ముంగిట ఈ తరహా పోకడలను తప్పుపడుతున్నాయి.