https://oktelugu.com/

Puri Jagannath-Krishna: పూరి జగన్నాథ్, కృష్ణ కాంబినేషన్ లో మిస్ అయిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరో కూడా వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో సినిమా చేసిన తర్వాత వాళ్లకు ఒక స్టైల్ అనేది క్రియేట్ అవుతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 14, 2024 / 11:52 AM IST
    Follow us on

    Puri Jagannath-Krishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన పూరి జగన్నాథ్. ఈయన మొదటి నుంచి కూడా తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ యూత్ ను అట్రాక్ట్ చేస్తూ వస్తున్నాడు. ఈయన చేసిన సినిమాల్లో చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక దానికి తోడుగా ఈయన ఏ హీరోతో సినిమా చేసిన ఆ హీరోకి సపరేట్ బాడీ లాంగ్వేజ్ ని క్రియేట్ చేయడంలో ఈయనను మించిన వారు ఎవరూ లేరు.

    అందుకే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరో కూడా వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయనతో సినిమా చేసిన తర్వాత వాళ్లకు ఒక స్టైల్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరికి తను ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ను డిజైన్ చేశాడనే చెప్పాలి. ఇక ఇలాంటి పూరి జగన్నాథ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. కానీ ఈ సినిమాకి ముందే కృష్ణతో ఒక సినిమాని స్టార్ట్ చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక కృష్ణతో తీయాల్సిన సినిమా స్టోరీ నే ఆ తర్వాత నాగార్జున ని హీరోగా పెట్టి ‘ శివమణి’ అనే సినిమా చేశాడు.

    ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే కృష్ణ తో ఈ సినిమా చేసినట్టయితే కృష్ణకి కూడా ఒక పవర్ ఫుల్ హిట్ సినిమా పడి ఉండేదని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. మొత్తానికైతే సూపర్ స్టార్ కృష్ణ పూరీ కాంబో లో ఒక సూపర్ హిట్ సినిమా మిస్ అయింది అనే చెప్పాలి.

    ఈ సినిమాని కృష్ణతో 1999వ సంవత్సరంలో తీయాలని ప్లాన్ చేశాడు. కానీ అప్పటికే కృష్ణ మార్కెట్ అనేది భారీగా డౌన్ అయింది. ఒకవేళ ఈ సినిమాతో కనక హిట్ పడినట్లు అయితే కృష్ణ మళ్లీ స్టార్ హీరోగా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో వెలుగొందేవాడు అంటూ అప్పట్లో వీళ్ల గురించి చాలా కథనాలు అయితే వచ్చాయి…