Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ప్రమాణస్వీకారం అనంతరం చిరంజీవికి నమస్కరించకుండా సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్.. అంతా ఫిదా

Pawan Kalyan: ప్రమాణస్వీకారం అనంతరం చిరంజీవికి నమస్కరించకుండా సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్.. అంతా ఫిదా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపులో కీలక భాగస్వామి అయ్యారు. పొత్తు పెట్టుకోవడం, సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపులో పవన్ పాత్ర కీలకం. అందుకే ఈసారి ప్రమాణస్వీకారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకం. సీఎంగా నాలుగో సారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పవన్ మంత్రిగా తొలి ప్రమాణం చేశారు. అయితే పవన్ ప్రమాణం చేసిన సమయంలో ప్రాంగణమంతా మార్మోగింది.వేదికపై ఉన్న మెగాస్టార్ చిరంజీవి,ప్రాంగణంలో ఉన్న పవన్ భార్య,రామ్ చరణ్ ఆనందోత్సవాలతో చప్పట్లు కొట్టారు. అటు పవన్ సైతం ఎటువంటి బెరుకు లేకుండా ప్రమాణం చేయడం విశేషం.

ప్రమాణ స్వీకార అనంతరం ప్రధాని మోదీతో కరచాలనం చేశారు పవన్ కళ్యాణ్. కాలికి నమస్కరించే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని వద్దని వారించారు. పవన్ ను దగ్గరకు తీసుకుని ఆశీర్వదించారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అనంతరం చంద్రబాబుకు పవన్ నమస్కరించగా.. ఆయన దగ్గరకు తీసుకున్నారు. ఆత్మీయ ఆలింగనం చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు నమస్కరిస్తూ ముందుకు సాగారు పవన్.

వేదిక చివర్లో అమిత్ షా, జేపీ నడ్డా, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పురందేశ్వరిలు కూర్చున్నారు. అమిత్ షా వద్దకు వెళ్ళిన పవన్ కాలికి మొక్కి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ అమిత్ షా సైతం వద్దని వారించారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అయితే ఆ తరువాత ఉన్న మెగాస్టార్ ను పట్టించుకోని పవన్ నమస్కరించుకుంటూ ముందుకు సాగారు. దీంతో అక్కడున్న వారితో పాటు ప్రాంగణంలో ఉన్న మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చివరివరకు అతిథులకు నమస్కరిస్తూ వెళ్లిన పవన్.. తిరిగి వచ్చి చిరంజీవి కాళ్లకు నమస్కారం పెట్టారు. కానీ మెగాస్టార్ వద్దని వారించారు. దీంతో పవన్ చర్యలపై అక్కడున్న వారు ఫిదా అయ్యారు. చిరంజీవిపై పవన్ కున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. మొత్తానికైతే పవన్ వ్యవహరించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలే వైరల్ అవుతున్నాయి.

 

పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం.. కన్నీళ్లు పెట్టుకున్న అన్నయ్య  | Pawan Kalyan taking oath | CVR NEWS

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version