లాహిరి లాహిరి లాహిరి’ హీరో ఇప్పుడెలా మారిపోయాడో చూడండి..

ఆదిత్య ఓం ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయన సుల్తాన్ పూర్ లో జన్మించిన ఈయన చదువు పూర్తయిన తరువాత మొట్టమొదటి సినిమా అవకాశం ‘లాహిరి లాహిరి లాహిరి’నే. తనకు ఈ మూవీ ఎంట్రీది అయినా ఎక్కడా బెరుకు లేకుండా నటించాడు.

Written By: Srinivas, Updated On : June 12, 2024 12:55 pm

Lahiri Lahiri Lahiri additya Om

Follow us on

సినిమా ఇండస్ట్రీలో నార్త్ నుంచి ఎక్కువగా హీరోయిన్లు రావడం చూశాం. కానీ కొందరు నార్త్ హీరోలు కూడా తెలుగులో అలరించారు. అయితే వారు ఉత్తర భారతదేశానికి చెందిన వారని చాలా మందికి తెలియదు. అచ్చం తెలుగు కుర్రాళ్లలాగే అలరించి, ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో ఓ హీరో తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. వైవీఎస్ చౌదరి తీసిన ఓ బ్లాక్ బస్టర్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో తెలుగులో లేకపోయినా సోషల్ మీడియాలో అలరిస్తున్నాడు. అయితే ఆయన అప్పటికీ, ఇప్పటికీ ఓ రేంజ్ లో మారిపోయాడు. ఇంతకీ ఎవరా హీరో? ఎలా మారిపోయాడో ఒక్కసారి చూడండి..

నవరసాలు కలిగిన సినిమాలను తీయడం వైవీఎస్ చౌదరికే చెల్లుతుంది. ఆయన తీసిన సినిమాల్లో ఎమోషన్ష్ తో పాటు సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్నీ భావాలను చూడొచ్చు. ఒకప్పడు ఆయన సినిమాలన్నీ దాదాపు హీట్టే. అంతేకాకుండా పలువురు కొత్త కుర్రాళ్లను పరిచడం చేసి వారికి జీవితాన్ని ఇచ్చాడు.ఈ క్రమంలో ఆయన తీసిన బ్లాక్ బస్టర్ మూవీల్లో ‘లాహిరి లాహిరి లాహిరి’ ఒకటి. ఇందులో నలుగురు హీరోలు కనిపిస్తారు. హరికృష్ణ, సుమన్, వినీత్ ఉంటారు. వీరితో పాటు ఆదిత్య ఓం కూడా ఉన్నాడు.

ఆదిత్య ఓం ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయన సుల్తాన్ పూర్ లో జన్మించిన ఈయన చదువు పూర్తయిన తరువాత మొట్టమొదటి సినిమా అవకాశం ‘లాహిరి లాహిరి లాహిరి’నే. తనకు ఈ మూవీ ఎంట్రీది అయినా ఎక్కడా బెరుకు లేకుండా నటించాడు. అంతేకాకుండా సీనియర్ నటులతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ మూవీ హిట్టుకావడంతో ఆదిత్య ఓం కు మంచి పేరు వచ్చింది. దీంతో ఆయనకు పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

ఈ మూవీ తరువాత ధనలక్స్మీ ఐలవ్ యూ సినిమా చేశాడు. ఆ తరువాత ‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు…’, ‘భామ కలాపం’ వంటి సినిమాల్లో నటించారు. నార్త్ బేస్ ఉన్న ఆదిత్య ఓం కు బాలీవుడ్ లోనూ అవకాశాలు వచ్చాయి. హిందీలో ‘ఖలీఫ్’ అనే సినిమాలో నటించారు. అయితే బాలీవుడ్ కంటే తెలుగులోనే ఎక్కువగా సినిమాల్లో నటించారు. ఆదిత్య నటుడు మాత్రమే కాకుండా కొన్ని డాక్యుమెంటరీలనురూపొందించాడు. ఆయన డైరెక్షన్ చేసిన హిందీ చిత్రం ‘మైలా’మంచి పేరు తెచ్చిపెట్టింది.