Pawan Kalyan suspends Arava Sridhar: నిన్నటి ఉదయం నుండి జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతోంది. వివాహం చేసుకొని ఒక కొడుకు కూడా ఉన్న మహిళతో ఆరవ శ్రీధర్ అక్రమ సంబంధం పెట్టుకోవడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం వంటి ఆరోపణలు ఎదురుకోవాల్సి వచ్చింది. దీనిపై జనసేన పార్టీ తీవ్రమైన విమర్శలను ఎగురుకుంటూ ఉంది. పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ ఈ వీడియో ని చూపిస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. గతం లో వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీ లో ఎమ్మెల్యేలు గా కొనసాగుతున్న అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ మరియు గోరంట్ల వంటి వారు కూడా ఇలాగే అడ్డమైన వీడియోలతో దొరికిపోయారు. కానీ వైసీపీ పార్టీ వీళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
కానీ జనసేన పార్టీ మాత్రం యాక్షన్ తీసుకుంది. కాసేపటి క్రితమే ఆరవ శ్రీధర్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరవ శ్రీధర్ పై నిన్నటి నుండి సోషల్ మీడియా లో వచ్చిన వార్తలు, ఒక మహిళా చేసిన ఆరోపణలపై విచారణ చేయాలనీ, అప్పటి వరకు ఆరవ శ్రీధర్ ని జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నామంటూ ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఈ ఆరోపణలపై ఒక కమిటీ ని వేయడం జరిగిందని, ఆ కమిటీ లో శివ శంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీ.సి.వరుణ్ ఉంటారని, ఆరవ శ్రీధర్ వారం రోజుల్లోపు కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ హరిప్రసాద్ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. జనసేన పార్టీ వెంటనే స్పందించి యాక్షన్ తీసుకున్నందుకు అభిమానులు సంతోషిస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఆరవ శ్రీధర్ కూడా ఈ విషయం పై స్పందిస్తూ ఒక వీడియో ని విడుదల చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఎలాంటి వాడిని అనేది నా నియోజకవర్గ ప్రజలు గత 7 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదని వాళ్లకు తెలుసు. కావాలని నా పుత్ర చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు చేసి నా రాజకీయ భవిష్యత్తుని చెడగొట్టాలని చూస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు ఆరవ శ్రీధర్. మరి ఈ విషయం లో నిజా నిజాలు ఏంటో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఆరవ శ్రీధర్ సాధారణంగా టీడీపీ పార్టీ కి చెందిన మనిషి. ఎన్నికల సమయం లో వారం రోజుల ముందు జనసేన పార్టీ లో చేరి బీ ఫార్మ్ ని అందుకొని పోటీ చేసి గెలిచాడు.
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. pic.twitter.com/Qw9ydOidyg
— JanaSena Party (@JanaSenaParty) January 28, 2026