Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సీఎం చంద్రబాబుపై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లే. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని ప్రకటించడంతో అంత ఉత్కంఠ నెలకొంది. శాసనసభ వేదికగా అధికార, విపక్షాల మధ్య గట్టి ఫైట్ ఉంటుందని అంతా భావించారు. కానీ గవర్నర్ ప్రసంగం తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నిరసన తెలుపుతూ శాసనసభ సమావేశాలను బహిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. సభలో అడుగుపెట్టి సరిగ్గా 11 నిమిషాల పాటు మాత్రమే ఉన్నారు. అనంతరం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వెళ్లిపోయారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.
* పవన్ కీలక ప్రసంగం
మరోవైపు శాసనసభ సమావేశాలు( assembly sessions ) ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సమస్యలను ప్రస్తావిస్తున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరును తప్పు పట్టారు. వారు అలా వ్యవహరించ కూడదని.. సభకు వచ్చి నిరసన తెలిపి బయటకు వెళ్లిపోవడం ఏమిటని ప్రశ్నించారు. సభలో ఉండి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తే.. ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతోందని కూడా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. వారికి సభలో ఉండే ధైర్యం లేదన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలను బహిష్కరించారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
* 11 నిమిషాలు తట్టుకోలేకపోయా..
అయితే మరోసారి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress party) పార్టీ సభ్యుల బూతు పురాణాన్ని, తిట్ల దండకాలను, వ్యవహార శైలిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. 11 నిమిషాల పాటు వారిని తట్టుకోలేకపోయామని.. అన్ని సంవత్సరాల పాటు ఎలా భరించారు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వారి బూతులను తట్టుకున్న గట్స్ మీదని.. మీకు హ్యాట్సాఫ్ అంటూ చంద్రబాబును ఉద్దేశించి అన్నారు పవన్ కళ్యాణ్. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఎమ్మెల్యేలంతా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ చప్పట్లు కొట్టారు. బెంచీలపై శబ్దం చేస్తూ మద్దతు తెలిపారు.
వైసీపీ అంటే గొడవలకు, భూతులకు పర్యాయ పదం…
ఇన్ని సంవత్సరాలు వాళ్ళను తట్టుకుని ఎలా నిలబడ్డారో ముఖ్యమంత్రి గారికి హాట్స్ ఆఫ్#PawanKalyan pic.twitter.com/W63mgMxiF7
— M9 NEWS (@M9News_) February 25, 2025