Indraja
Indraja: హాలీవుడ్, బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. తెలుగులో ఆ తరహా షో అంటే జబర్దస్త్ అని చెప్పొచ్చు. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ ఈటీవీలో మొదలైంది. రోజా, నాగబాబు జడ్జెస్ కాగా.. అనసూయ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. బలగం వేణు, రోలర్ రఘు, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ఛమ్మక్ చంద్ర, షకలక శంకర్ మొదట్లో ఉన్న టీమ్స్. అనసూయ మితిమీరిన గ్లామర్ తో తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచింది.
కమెడియన్స్ డబుల్ మీనింగ్స్ జోక్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. ఒక దశలో జబర్దస్త్ అంటే బూతు కామెడీ అనే రేంజ్ కి వెళ్ళిపోయింది. విమర్శలు, వివాదాలు చెలరేగడంతో తర్వాత డోసు తగ్గించారు. ఎంతో కొంత డబుల్ మీనింగ్ కామెడీ మాత్రం కామన్ గా ఉంటుంది. రెండు మూడేళ్ళుగా జబర్దస్త్ తన వైభవం కోల్పోతూ వస్తుంది. నాగబాబు, రోజా, అనసూయ తప్పుకున్నారు. స్టార్ కమెడియన్స్ సైతం బయటకు వెళ్ళిపోయారు. కొత్త టీమ్స్, కమెడియన్స్ మరలా డబుల్ మీనింగ్ జోక్స్ మీద ఆధారపడటం ఎక్కువైంది.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజను తాజా ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించడం జరిగింది. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్స్ జోక్స్ డోసు ఎక్కువైంది. మీరు ఏమంటారని అడగ్గా.. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్స్ జోక్స్ వేస్తారు. చివరకు నా మీద కూడా కమెడియన్స్ డబుల్ మీనింగ్స్ జోక్స్ వేస్తారు. కానీ షో సక్సెస్ కదా. ఇప్పుడు ప్రతి చోటా ఇది ఉంది. ఓటీటీ కంటెంట్, సినిమాలలో డబుల్ మీనింగ్స్ జోక్స్ ఉంటున్నాయని, ఆమె సమర్ధించారు. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్స్ జోక్స్ వేయడం తప్పేమీ కాదన్నట్లు ఇంద్రజ వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇంద్రజ 90లలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. గ్యాప్ ఇచ్చి బుల్లితెర షోలలోకి ఎంట్రీ ఇచ్చింది. రోజా వెళ్ళిపోయాక ఇంద్రజకు మల్లెమాల సంస్థలో సముచిత స్థానం దక్కింది. టీవీ షోలు చేస్తూనే.. సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. ఇంద్రజ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది.