spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఆ నలుగురికి పవనే స్పెషల్ టాస్క్!

Pawan Kalyan: ఆ నలుగురికి పవనే స్పెషల్ టాస్క్!

Pawan Kalyan: ఏపీలో ఒక విచిత్ర రాజకీయ పరిస్థితి నడుస్తోంది. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పెద్ద సోషల్ మీడియా యుద్ధమే నడుస్తోంది అడ్డగోలుగా. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఓ నలుగురిపై ప్రధానంగా అనుమానం ఉంది. కేవలం బిజెపిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడమే వారి ముఖ్య ఉద్దేశం. ఓ నలుగురు టాస్క్ఫోర్స్ గా ఏర్పడి.. వారికి ఎవరో టాస్క్ ఇచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఆ నలుగురు ఒకే భావజాలంతో మాట్లాడుతుండడం.. వివాదం చేయదలుచుకోవడం వంటివి చూస్తుంటే మాత్రం ఏదో ఒక అనుమానం కలగక మానదు. వారే జర్నలిస్టు తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ జోసెఫ్ రావణ్. ఈ నలుగురు బిజెపిని వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తప్పకుండా వీరి వెనుక అదృశ్య శక్తి ఉందన్న అనుమానం పెరుగుతోంది.

* పవన్ కు వ్యతిరేకంగా..
జర్నలిస్ట్ తులసి చందు ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ ద్వారా సూపరిచితురాలు అయ్యారు. ఆమె ఇటీవల బీజేపీని దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నేరుగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో కూడా ఆమె మాట్లాడారు అభ్యంతరకర వ్యాఖ్యలు.తులసి చందు జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ప్రముఖ మీడియా ఛానల్లో పనిచేశారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. అయితే ఆమె సైతం ఒకే లైన్లో మాట్లాడుతుండడం అనుమానాలకు తావిస్తోంది. మంచి ఇన్వెస్టిగేటెడ్ జర్నలిస్ట్ గా పేరుపొందిన ఆమె.. ఇటీవల వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది.

* అడ్డంగా బుక్ అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్..
సమకాలీన రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విశ్లేషిస్తుంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్. తెలుగు నాట ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. ఆయన సైతం బిజెపికి వ్యతిరేకి అనే ముద్ర ఉంది. అయితే అనుకోని విధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. బిజెపితో పవన్ ను జతచేస్తూ ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఒక గాలి కబురు జనాల్లోకి వదిలారు. అది మిస్ ఫైర్ అయ్యింది. దీంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంతటివాడే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. కానీ తెలంగాణలో జర్నలిస్టులను పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉసిగొలుపుతూ.. చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు.

* జోసెఫ్ రావణ్ తో ప్రకాష్ రాజ్..
ఇక ప్రకాష్ రాజ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భారతీయ జనతా పార్టీకి, పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఏ చిన్న కంటెంట్ దొరికిన.. ఆ కామెంట్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది గుర్తించకుండా రభస చేసే తత్వం ప్రకాష్ రాజ్ ది. హిందూ దేవుళ్ళతో పాటు దేవతలను దారుణంగా దూషిస్తున్న జోసెఫ్ రావణ్ ను అడ్డగోలుగా సమర్థిస్తూ.. తెర వెనుక ప్రోత్సాహం అందిస్తూ.. పవన్ కళ్యాణ్ పై దూషణలు కొనసాగించాలని సూచిస్తూ సాగిన ఆడియో సంభాషణలు సైతం బయటకు వచ్చాయి. ఇలా ఈ నలుగురు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ మాదిరిగా.. ఎవరో ప్రయోగిస్తున్న అస్త్రం అన్నట్టు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం విశేషం. అయితే ఇటువంటి వ్యక్తుల వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను మరింత పెంచుతాయే తప్ప తగ్గించవు అన్న విషయాన్ని గ్రహించుకోవాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular