Pawan Kalyan Son Mark Shankar: గత కొంతకాలం గా లోకల్ మీడియా నుండి నేషనల్ మీడియా వరకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) పేరు ఎలా మారుమోగిపోతుందో మనమంత చూస్తూనే ఉన్నాం. సమ్మర్ క్యాంప్ కోసం ఒక కిచెన్ స్కూల్ లో చేరిన మార్క్ శంకర్, దురదృష్టం కొద్దీ జరిగిన అక్కడి అగ్ని ప్రమాదం లో చిక్కుకొని చిన్న గాయాలతో బయటపడడం అభిమానులను కలవరానికి గురి చేసింది. ఈ ప్రమాదం జరిగిన రెండు రోజులకే మార్క్ శంకర్ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. అప్పటి నుండి మార్క్ శంకర్ హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఇక నుండి ఆయన విద్యాబ్యాసం కూడా హైదరాబాద్ లోనే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. విరామం సమయం లో ఆయన ICRISAT స్కూల్ ని సందర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Mark Shankar : పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ లేటెస్ట్ వీడియో వైరల్..ఇంత క్యూట్ గా ఉన్నాడేంటి!
అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ స్కూల్ ని సందర్శించాడు?, అంత అవసరం ఏమొచ్చింది అని అభిమానులు ఆరాలు తియ్యగా, తన కొడుకు మార్క్ శంకర్ కి అడ్మిషన్ కోసం ఈరోజు ఆయన ఈ స్కూల్ ని సందర్శించినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లోని పఠాన్ చెరులో ఈ స్కూల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ స్కూల్ ని సందర్శించిన వీడియో ని ఎక్సక్లూసివ్ గా కింద అందిస్తున్నాము చూడండి. మార్క్ శంకర్ గతం లో కూడా హైదరాబాద్ లోనే చదువుకుంటూ ఉండేవాడని కొందరు, లేదు సింగపూర్ లోనే చదువుకుంటున్నాడని మరికొందరు, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సోషల్ మీడియా లో ప్రచారం చేశారు. కానీ ఎవరికీ ఈ విషయం పై స్ఫష్టమైన అవగాహన లేదు. తన కొడుకు తన ఇష్టం, ఎక్కడైనా చదివించుకుంటాడు,మీకెందుకు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నించిన వారిపై మండిపడుతున్నారు.
Also Read: Mark Shankar: మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్ అదేనా..? మరి సింగపూర్ కి ఎందుకెళ్ళాడు?
ఇదంతా పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి,పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది సమయం పూర్తి అయ్యినందున, ఈ ఏడాది లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక్క పిఠాపురం నియోజకవర్గం లోనే 308 కోట్ల రూపాయిల ఖర్చు చేసినట్టు అభిమానులు చెప్తున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయంటే అది పవన్ కళ్యాణ్ కారణంగానే అని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. మరోపక్క ఆయన పెండింగ్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ కి డేట్స్ ని కేటాయించాడు పవన్ కళ్యాణ్.