Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ సీరియస్ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: పవన్ సీరియస్ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో హోదా కోసం డిప్యూటీ సీఎం అనే కొత్త పదాన్ని చేర్చుతారు. ఒకే పార్టీలో నేతల మధ్య పోటీ ఉంటే.. పొత్తులో భాగంగా వివిధ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. అటువంటి సమయంలో డిప్యూటీ సీఎం అనే విభజనతో ఒక పదవిని సృష్టిస్తారు. ప్రతి రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం పోస్టు ఉంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో సైతం డిప్యూటీ సీఎం పదవులు ఉండేవి. అటు తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్లో సైతం డిప్యూటీ సీఎం సంస్కృతి కొనసాగింది. జగన్మోహన్ రెడ్డి హయానికి వచ్చేసరికి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు అయ్యారు. కానీ ఈసారి చంద్రబాబు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. అయితే గతానికి భిన్నంగా డిప్యూటీ సీఎం హోదాలో సరైన గౌరవం అందుకుంటున్నారు పవన్ కళ్యాణ్.

* ఎంతో ప్రాధాన్యం..
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయాలు భాగస్వామ్యం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ను. ఆయన శాఖల విషయంలో కూడా ఎంతో స్వతంత్రం ఇచ్చారు. పంచాయితీ రాజ్ తోపాటు గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వర్తిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ శాఖలో నిధుల మంజూరు, పనులు చేపట్టడం, సంస్కరణలు అమలు చేయడం వంటి వాటి విషయంలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. సీఎం మాదిరిగా కొన్ని శాఖల వైఫల్యాల గురించి కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్. అయితే మిగతా మంత్రులు చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అదే గౌరవాన్ని పొందుతున్నారు.

* రాజ్యాంగంలో లేదు..
వాస్తవానికి రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లేదు. రాజకీయంగా సృష్టించుకున్న పదవి అది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎంగా ఉన్న తన ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో మాత్రం చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖ విషయంలో గిరిజన ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణ శాఖ మంత్రిగా చాలా విషయాల్లో సంస్కరించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామాల స్వరూపాన్ని మార్చారు. పల్లె పండుగ పేరుతో గ్రామీణ రహదారులను మెరుగుపరిచారు. అటవీ శాఖ మంత్రిగా కొండా శిఖర గ్రామాల ప్రజల కోసం సరైన రహదారులను నిర్మించారు. ఇప్పుడు గోదావరి పుష్కరాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. గోదావరి నది కాలుష్యంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయితే డిప్యూటీ సీఎంల విషయంలో గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక సీరియస్ డిప్యూటీ సీఎంలా గుర్తింపు పొందారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version