YS Jagan Vs Pawankalyan : ఏపీ సీఎం జగన్ పై పవన్ శివతాండవం ఆడేశారు. నిన్నటి జగన్ విమర్శలపై పవన్ ఘాటుగా రియాక్టయ్యారు. ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదల కోసం పోరాటం, క్లాస్ వార్ ఇలా జగన్ నోటి నుంచి జాలువారిన మాటలన్నింటినీ గుర్తుచేస్తూ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ విమర్శలపై పవన్ ఇచ్చిన రియాక్షన్ కు వైసీపీ శ్రేణులకు బొమ్మ కనిపిస్తోంది. ఏకంగా పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘పాపం పసివాడు’ పోస్టర్ తో తిప్పికొట్టిన తీరుతో మైండ్ బ్లాక్ అవుతోంది. పవన్ ను కెలికితే రియాక్షన్ ఇలానే ఉంటుందని నెటిజన్లు, జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు.
నిన్నటి బాపట్ల జిల్లాలో మత్స్యకార భరోసా పంపిణీలో పవన్ తో పాటు చంద్రబాబుపై జగన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దర్నీ స్థానికేతరులుగా అభివర్ణించారు. హైదరాబాద్ పొరుగు రాష్ట్రంగా చెప్పుకొచ్చారు. వారు గెలిస్తే అమరావతి అంటారు.. లేకుంటే హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అని చెబుతారని ఎద్దేవా చేశారు.తాను ప్రజల గురించి ఆలోచిస్తుంటే.. చంద్రబాబు, పవన్ లు మాత్రం పొత్తుల గురించి ఆలోచిస్తున్నారని విమర్శలు చేశారు. అటు చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూనే.. ప్రధానంగా పవన్ నే టార్గెట్ చేస్తూ జగన్ తనలో ఉన్న ఆక్రోశాన్ని బయటపెట్టారు. దీంతో పవన్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.
పాపం పసివాడు సినిమాను గుర్తుచేస్తూ ఎవరైనా జగన్ పెట్టి రీమేక్ చేయాలన్నారు. అ పోస్టర్ ఎడారిలో ఓ చిన్న పిల్లవాడు సూటుకేసు పట్టుకుని నడుచుకుంటూ పోతున్నట్లుగా ఉంది. ఇందులో చిన్న మార్పు చేయాలని.. జగన్ చేతిలో సూట్ కేసు బదులు సూట్ కేసు కంపెనీలు పెట్టాల్సి ఉంటుందన్నారు. తన అక్రమార్జనను మనీ లాండరింగ్ ద్వారా ఈ సూట్ కేసుల ద్వారా జగన్ పంపుతున్నారని..తాను అమాయకుడిగా నటిస్తున్నరాని పవన్ సెటైర్ వేశారు. అయితే ఈ సినిమా తీయడానికి రాజస్థాన్ ఎడారులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో నదుల్లో తవ్విన ఇసుక పాయింట్ల వద్ద సినిమా తీసుకోవచ్చన్నారు. అత్యంత ధనిక సీఎంగా ఉంటూ.. క్లాస్ వార్ అంటూ.. చెప్పుకోవడంపై పవన్ మండిపడ్డారు . జగన్ ఏమైనా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డా అని ప్రశ్నించారు. జగన్ నుంచి రాయలసీమ ఏదో ఒక రోజు విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తానికైతే పవన్ ను కెలికి జగన్ మూల్యం చెల్లించుకున్నారున్న మాట.
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade… pic.twitter.com/9zOImRapAd
— Pawan Kalyan (@PawanKalyan) May 17, 2023
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan satirical tweet on ys jagan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com