Photo Story: సినిమాల్లో ఛాన్స్ రావాలంటే మామూలు విషయం కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్ జీవితాన్ని గడుపుతారు. కానీ కొందరు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నా సరైన గుర్తింపు రాదు. సౌత్ ఇండస్ట్రీ కి చెందిన ఓ నటి చేతికి దొరికిన సినిమాలన్నీంటిని చేసుకుంటూ పోయింది. కానీ అనుకున్న గుర్తింపు రాలేదు. ప్రస్తుతానికి ఆ అమ్మడుకు పూర్తిగా అవకాశం తగ్గిపోయాయి.
అయితే సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా ఈ భామ నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేయడంతో కుర్రాళ్ళు ఆమెని చూసి షాక్ అవుతున్నారు. 45 ఏళ్లు నిండినా అందంతో ఆకట్టుకోవడంతో ఆమె గురించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా..?
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ఎవరో కాదు..వేదిక. సౌత్ ఇండస్ట్రీ ఈమెకు బాగా కలిసి వచ్చింది. 2006 లోనే మద్రాసి అనే సినిమాతో ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి విజయదశమి సినిమాలో కనిపించింది. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. ఆ తర్వాత బాణం సినిమాతో పేరు తెచ్చుకుంది.
ఈ సమయంలో తమిళ ఇండస్ట్రీ నుంచి పలు ఆఫర్లు వచ్చాయి. లారెన్స్ తో కలిసి కలిసి ముని సినిమాలో నటించి అక్కడ గుర్తింపుతెచ్చుకుంది. ఆ తర్వాత ఇదే లారెన్స్ తో కాంచన 3 తో ఈమెకు స్టార్ గుర్తింపు వచ్చింది. కానీ అనుకున్న అవకాశాలు మాత్రం రాలేకపోయాయి. ఇక తెలుగులో చివరిగా బంగార్రాజు చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన ఈమె మరో సినిమాలో కనిపించ లేదు. లేటెస్ట్ గా ఈమె చిన్నప్పుడు తీసుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది .