Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan - Modi : పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ చేసిన పనికి...

Pawan Kalyan – Modi : పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీ చేసిన పనికి అంతా ఫిదా

Pawan Kalyan – Modi : ప్రపంచంలో భారత జాతీయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు. అటు దేశవ్యాప్తంగా జాతీయవాదం బలంగా ఉన్న నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అందుకే పవన్ ప్రధాని మోడీకి వీరాభిమానిగా మారారు. గత ఎన్నికల్లో బిజెపి గెలిచిన తరువాత.. పవన్ ఎన్డీఏలో చేరడానికి ప్రధాని మోదీయే కారణం. 2014లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. నాడు విపక్ష నేతగా ఉన్న సమయంలో మోడీ ఏపీకి వచ్చారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని పవన్ కలుసుకున్నారు. అయితే నాడు ఏపీలో టిడిపి.. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చింది.

ఆ ఐదు సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ ఎన్నడు ప్రధానిని కలిసేందుకు ఇష్టపడలేదు. కేంద్రం నుంచి పదవులు తీసుకునే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. అందుకే పవన్ అంటే మోదీ చాలా అభిమానం పెంచుకున్నారు. గత ఎన్నికల్లో విభజన హామీల అమలు నేపథ్యంలో బిజెపిని పవన్ విభేదించారు. కానీ ఎన్నడూ ప్రధాని మోదీని విమర్శించలేదు. 2019 ఎన్నికల తరువాత ఎన్డీఏలో పవన్ చేరినా.. ప్రధాని మోదీని కలిసింది ఒకటి రెండు సార్లు మాత్రమే. అందుకే పవన్ ఆత్మాభిమానాన్ని అభిమానించే మోదీ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

గత నెలలో చిలకలూరిపేట సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఆ సమయంలో సైతం పవన్తో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈరోజు రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభకు ప్రధాని మోదీ వచ్చారు. ఆయనతోపాటు పవన్ వేదిక పంచుకున్నారు. ప్రత్యేకంగా శాలువ కప్పి సన్మానించారు. పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. కానీ ప్రధాని మోదీ వద్దంటూ సముదాయించారు. పవన్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ప్రధాని మోదీ. ఈ తరహా అభిమానాన్ని చూసి ఫిదా అయిపోయారు పవన్.

Pawan Kalyan And PM Modi At Rajahmundry | ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ పాదాభివందనం  | News18 Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version