Pawan Kalyan: రాజకీయం అంటే ఇప్పుడు అర్థం మారిపోయింది. రాజకీయం అంటే సేవకు కాదు.. సంపాదన అన్నంతగా పరిస్థితి మార్చింది. సొంత ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేసేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు. దాదాపు రాజకీయ నాయకులంతా ఈ విధంగా వ్యవహరిస్తుండడం వల్లే రాజకీయాలంటే ఒక బూతు పదంగా మారిపోయింది. అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) మాత్రం భిన్నం. ఆయన తన రాజకీయాలను నిజంగా ప్రజలకు ఉపయోగపడాలని బలంగా కోరుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షానికి వచ్చినా రాజకీయ లెక్కలు మాత్రం వేయరు. ప్రజా సమస్యల పట్ల మనసుతో స్పందించే నేత పవన్ కళ్యాణ్. అధికారంలో లేనప్పుడే తన రాజకీయాల ద్వారా వేలాదిమందికి సాయపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరంపర కొనసాగిస్తున్నారు.
* గిరిజన ప్రాంతాల్లో వెలుగులు..
గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ కు దక్కుతుంది. తన అధికారం ద్వారా వారికి మేలు చేసే పనిలో ఉన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు, లంక గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. అందుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును ఆహ్వానించారు. ఒక్కో క్రీడాకారిణికి ఐదు లక్షల చొప్పున.. మొత్తం 84 లక్షల రూపాయలను బహుమతిగా అందించారు. అది కూడా ప్రభుత్వం తరుపున కాదు. పూర్తిగా తన స్వరార్జితం నుంచి.. ఒకవేళ ఆయన ప్రభుత్వం తరఫునుంచి అందించిన అది అభినందనీయమే. కానీ పవన్ కళ్యాణ్ తన సొంతంగా అందించి మానవత్వం చాటుకున్నారు.
* సాయంత్రానికల్లా రోడ్డు..
అంధ క్రికెటర్లు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల వారే. వారిలో చాలామందికి ఇల్లు గడవడం కూడా కష్టం. ఎక్కడైనా క్రికెట్ మ్యాచ్లు దొరికితే వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ.. లేకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి. తిండికే ఇబ్బంది పడుతున్న వారు పౌష్టికాహారం, ఇల్లు, వైద్యం తదితర సౌకర్యాల గురించి ఆలోచించే ప్రయోజనం ఉండదు. ఒక్కో క్రీడాకారిణి కి ఒక్కో కష్టం. అటువంటి వారి కష్టాలను తీర్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఆంధ్ర టీం కెప్టెన్ దీపిక తమ ఊరికి తారు రోడ్డు వేయాలని అభ్యర్థించారు. వెంటనే పనులు మొదలయ్యేలా చూసారు పవన్ కళ్యాణ్. ఆమె ఉదయం రోడ్డు కోసం అభ్యర్థించగా.. సాయంత్రానికి కోట్ల రూపాయల నిధులతో అనుమతులు మంజూరయ్యాయి. అల్లూరి జిల్లాకు చెందిన ఓ పేద క్రీడాకారిని తమ ఇంట్లో పరిస్థితిని చెప్పగా సొంత నిధులతో గృహోపకరణాలు, ఇంటి అవసరాలను తన సొంత నిధులతో సమకూర్చారు పవన్ కళ్యాణ్. సాధారణంగా క్రీడలు అంటే ఈ పరిస్థితి ఉంటుంది కానీ.. పవన్ కళ్యాణ్ మాదిరిగా రాజకీయ నాయకులు ఆలోచించడం మాత్రం చాలా అరుదు.