Pawan Kalyan : పాక్ ఉగ్రదాడులకు వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సిందూర్( operation sindoor ) చేపట్టిన సంగతి తెలిసిందే. మిస్సైల్ సర్జికల్ స్ట్రైక్ లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారత సైన్యానికి మద్దతు వెల్లువెత్తుతోంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని.. ఇది భారతీయులంతా గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. దేశం దృష్టిని ఆకర్షించిన మహిళా ఆధికారులు
* శాంతి జపం వల్లే..
పాకిస్తాన్ ప్రజలకు, మిలటరీ కి నష్టం వాటిల్లకుండా.. కేవలం ఉగ్రవాదుల స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడి చేయడం గొప్ప విషయం గా పేర్కొన్నారు పవన్( deputy CM Pawan Kalyan). గాంధీ మార్గంలో నడిచినందుకే మన దేశానికి ఈ గతి పట్టిందని పవన్ ఆవేశపూరితంగా అన్నారు. మనం శాంతి మంత్రం జపిస్తుంటే.. వేరే దేశం నుంచి వచ్చి మతం అడిగిమరీ హిందువులను చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1990 నుంచి కాశ్మీర్ పండిట్లను చంపడంతో ఉగ్రవాదుల అరాచకాలు పెరిగిపోయాయని.. అంత్యక్రియలు చేసే చోట సైతం మారణ హోమం చేసి హిందువులను చంపేస్తారని గుర్తు చేసుకున్నారు పవన్.
* స్ట్రాంగ్ వార్నింగ్..
అదే సమయంలో పవన్ కీలక హెచ్చరికలు చేశారు. సెలబ్రిటీలు( celebrities), సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని హెచ్చరించారు. మీడియాతో పవన్ మాట్లాడుతున్న సందర్భంలో బయట కుక్కలు అరుస్తున్న శబ్దాలు ఆయనకు వినిపించాయి. ఆ కుక్కలు మొరుగుతున్న మాదిరిగానే సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు. ఒకవేళ ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read : యుద్ధ భయంలో పాకిస్తాన్..ఏటీఎంలు ఖాళీ.. స్టాక్ మార్కెట్ పతనం
కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు
ముఖ్యంగా సెలబ్రెటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొద్దు
ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవు – ఏపీ డిప్యూటీ సీఎం పవన్… pic.twitter.com/E4DvcFn2fV
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2025