ఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Morphing Arrests: పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. ముగ్గురి అరెస్ట్!

Pawan Kalyan Morphing Arrests: పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం.. ముగ్గురి అరెస్ట్!

Pawan Kalyan Morphing Arrests: సోషల్ మీడియాలో( social media) తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు జరిగింది. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు ఓ ముగ్గురు. ఏకంగా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి దారుణమైన పోస్టులను పెట్టారు. జనసేన నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏపీ పోలీసులు. ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం. ఇటీవల ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగాయి. పవన్ సైతం హాజరయ్యారు. ఆయన యోగాసనాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ ముగ్గురు.

Also Read: Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు.. రానివ్వం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఫోటోలు మార్ఫింగ్ చేసి
ఇటీవల విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International yoga day )జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దాదాపు మూడు లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సామాన్యుడి మాదిరిగానే యోగాసనాలు వేశారు. అయితే ఆ దృశ్యాలను అనుచితంగా, అవమానకరంగా కొంతమంది వ్యక్తులు పోస్టులు పెట్టారు. వీటిని చూసిన జనసేన నేతలు, అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, పాముల రామాంజనేయులు.. తెలంగాణకు చెందిన షేక్ మహబూబ్ బాషా లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: Pawan Kalyan speech : పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారతీస్తాం జాగ్రత్త అంటూ జగన్ కి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్!

కుంభమేళా సమయంలో కూడా..
మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగానదిలో స్నానం చేశారు. అప్పట్లో కూడా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పట్లో కూడా జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కమెడియన్ తో పోల్చుతూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. అయితే పవన్ పై వ్యతిరేక ప్రచారం ఇప్పుడే కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. అప్పట్లో పవన్ రియాక్షన్ తోనే ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వెంటాడారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Joseph Ravan : రావణ్ ఆటలో అరటిపండు.. కథ మొత్తం గగనది.. ఆమె వెనక ఉన్నది ఆ నాయకుడు..

Joseph Ravan : ముసుగు తొలగిపోతోంది. తెర వెనుక ఉన్న చీకటి శక్తులు.. వెలుగులోకి వస్తున్నాయి. వారి లక్ష్యాలు.. దానికోసం ఎంచుకున్న మార్గాలు బయట పడుతున్నాయి. పైకి పెట్టింది ప్రశ్న అనే పేరు మాత్రమే.....

Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే..

Ranveer Singh: 'ధురంధర్' సిరీస్ తో హీరో రణవీర్ సింగ్ ఓవర్ నైట్ లో ఎలాంటి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. డిసెంబర్ నెల నుండి జూన్ వరకు ఆయన...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version