Homeఆంధ్రప్రదేశ్‌Professor Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఇవే మా సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పగలరా..

Professor Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఇవే మా సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పగలరా..

Professor Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి దూకుడు ప్రదర్శించలేదు. జనసేన నాయకులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వాటిని స్వీకరించారు. పెద్దగా కేసులు నమోదు చేసినట్టు కూడా కనిపించలేదు. కానీ వైసీపీ అనుకూల మీడియా.. సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఏపీ పోలీసులు తెలంగాణలోకి వచ్చేశారు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా ప్రచారం చేసింది.

నాగేశ్వర్ మాట్లాడిన మాటలు తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు గాని.. ఏపీ మంత్రి లోకేష్ గాని ఒక మాట కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ పరోక్షంగా మాత్రమే విమర్శించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద మాట్లాడి.. దానిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ప్రకటించారు. అంతేకాదు కేసులు నమోదు చేయకూడదని పోలీసులకు సూచించారు. ఇక సోషల్ మీడియాలో నాగేశ్వర్ అరెస్టు అని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఖండించారు. ఇదంతా కూడా చవకబారు ప్రచారం అంటూ ఆమె క్లారిటీ ఇచ్చేశారు.

నాగేశ్వర తన చేసిన వ్యాఖ్యలను విరమించుకున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కేసులు పెట్టబోమని స్పష్టం చేసింది. కానీ మధ్యలో కొంతమంది సో కాల్డ్ (ఈ మాట అంటున్నందుకు ఎటువంటి పశ్చాతాపం లేదు. ఇబ్బంది అంతకంటే లేదు) జర్నలిస్టులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా వచ్చామని ప్రకటించారు. హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అందులో నారా చంద్రబాబునాయుడు ను.. ఏపీ మంత్రి నారా లోకేష్ ను.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. పైగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ చివరిలో నినాదాలు చేశారు.

కేసు పెట్టబోమని ఏపీ ప్రభుత్వం చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. ఇక గొడవ ఎక్కడిది. వాస్తవానికి ఈ గొడవ కారణం ప్రొఫెసర్ నాగేశ్వర్. అనవసరంగా లేని వివాదాన్ని గెలుక్కున్నారు. తాను ఒక మేధావిని అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. పైగా యుద్ధం మొదలుపెట్టారు.. ముగింపు నేను ఇస్తానని వీరలెవల్లో లెక్చర్లు ఇచ్చారు. ఆయనకు సంఘీభావంగా కొంతమంది ఊరు పేరు లేని వ్యక్తులు ప్రెస్ క్లబ్ లోకి వచ్చారు. పైగా నాగేశ్వర్ భుజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ వాదుల మీద కాల్పులు జరుపుతున్నారని పనికిమాలిన వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా చూస్తుంటే నాగేశ్వర్ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారిపోయారని.. ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టులు తెరపైకి వచ్చారని.. రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రణాళిక రూపొందించాలని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకున్నప్పుడు.. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పోలీసులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎవరు కేసు నమోదు చేస్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తారు.. ఇక్కడ పత్రికా స్వేచ్ఛను తొక్కి వేసిన కుట్ర ఏముంది? అని టిడిపి కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే తెలంగాణ నుంచి పబ్లిష్ అయిన కొన్ని పత్రికల్లో నాగేశ్వర్ అరెస్ట్ అంటూ పతాక శీర్షిక స్థాయిలో వార్తలను ప్రసారం చేశారు. సోషల్ మీడియా గ్రూపులలో విపరీతంగా ప్రచారం చేశారు. అసలు వాస్తవానికి వీరంతా ఎందుకు తెరమీదకి వచ్చినట్టు.. ఎందుకు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చినట్టు.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రికి.. తెలంగాణ ముఖ్యమంత్రి కి వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేసినట్టు.. కేవలం ఒక మీడియాలో మాత్రమే వీరి వార్తలు ఎందుకు హైలెట్ అయినట్టు. . చూస్తుంటే రెండు పార్టీల కోసం వీరంతా పనిచేసినట్టు అర్థమవుతోంది.

హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాత్రికేయులు నాగేశ్వర్ విషయాన్ని ప్రస్తావించకుండా.. ఆంధ్రా వాళ్లను తొక్కేస్తాం… తరిమి కొడతాం.. పాతి పెడతామంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి దీని వెనుక ఉన్నది ఎవరు.. ఎవరు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఎవరు వీరికి అమ్ముడుపోయారు.. అనే ప్రశ్నలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. అలాగని అవి సమాధానం లభించని ప్రశ్నలు కూడా కాదు. కాకపోతే ఈ వివాదాన్ని ప్రారంభంలోనే తొక్కిపడేయడంతో కొంతమంది సో కాల్డ్ జర్నలిస్టుల ఆటలు సాగలేదు. అందువల్లే రెండు రోజులు హడావిడి చేసిన వారు.. ఆ తర్వాత అన్ని మూసుకున్నారు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయం మాట్లాడుతూ.. తెలంగాణ అమరులకు జోహార్లు అని చెప్పడమే హాస్యాస్పదం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని నాగేశ్వర్ గురించి.. తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావించని ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తులు మాట్లాడటం నిజంగా ఆశ్చర్యకరం..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version