Pawan Kalyan Morphing Arrests: సోషల్ మీడియాలో( social media) తప్పుడు ప్రచారాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు జరిగింది. అయినా సరే వారి వైఖరిలో మార్పు రావడం లేదు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు ఓ ముగ్గురు. ఏకంగా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి దారుణమైన పోస్టులను పెట్టారు. జనసేన నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏపీ పోలీసులు. ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం. ఇటీవల ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగాయి. పవన్ సైతం హాజరయ్యారు. ఆయన యోగాసనాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఈ ముగ్గురు.
Also Read: Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు.. రానివ్వం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఫోటోలు మార్ఫింగ్ చేసి
ఇటీవల విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ( International yoga day )జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దాదాపు మూడు లక్షల మందికి పైగా ఒకేసారి యోగాసనాలు వేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సామాన్యుడి మాదిరిగానే యోగాసనాలు వేశారు. అయితే ఆ దృశ్యాలను అనుచితంగా, అవమానకరంగా కొంతమంది వ్యక్తులు పోస్టులు పెట్టారు. వీటిని చూసిన జనసేన నేతలు, అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కర్రి వెంకట సాయి వర్మ, పాముల రామాంజనేయులు.. తెలంగాణకు చెందిన షేక్ మహబూబ్ బాషా లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కుంభమేళా సమయంలో కూడా..
మొన్న ఆ మధ్యన పవన్ కళ్యాణ్( Pawan Kalyan) కుటుంబ సమేతంగా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగానదిలో స్నానం చేశారు. అప్పట్లో కూడా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పట్లో కూడా జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కమెడియన్ తో పోల్చుతూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. అయితే పవన్ పై వ్యతిరేక ప్రచారం ఇప్పుడే కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. అప్పట్లో పవన్ రియాక్షన్ తోనే ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వెంటాడారు.
పవన్ కళ్యాణ్ గారి పై పిచ్చి పిచ్చి పోస్టుల పెట్టే వారి పై పిఠాపురం పీస్ లో జనసైనుకుల పిర్యాదు…@randomforestvsp తిన్నావా బ్రో? pic.twitter.com/ZKiKRVPDD6
— Venkat Mogali… (@venkatmogali) June 22, 2025