Prabhas helps Fish Venkat : సినిమాల పరంగా మాత్రమే కాదు, వ్యక్తిత్వం పరంగా కూడా ప్రభాస్(Rebel Star Prabhas) ‘బాహుబలి’ లాంటోడు అనే విషయం ఎన్నో సార్లు రుజువు అయ్యింది. అసలు ప్రభాస్ నిజ జీవితం లోని క్యారక్టర్ ని ఆదర్శంగా తీసుకొనే రాజమౌళి(SS Rajamouli) ‘బాహుబలి’ క్యారక్టర్ ని రాసుకున్నాడా అని ప్రతీ ఒక్కరికి అనుమానం రావొచ్చు. ఇప్పటి వరకు ఆయన ఎవరికీ తెలియకుండా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసాడు. వాటి గురించి ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. వేరే వాళ్ళ ద్వారా తెలియడమే కానీ, ప్రభాస్ ఎప్పుడు బయటపడలేదు. అయితే ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) గత కొద్దిరోజుల నుండి తీవ్రమైన అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న విషయం ప్రభాస్ దృష్టికి వెళ్ళింది. ప్రభాస్ చేసిన సహాయం గురించి ఫిష్ వెంకట్ కుమార్తె మీడియా తో చెప్పిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆమె మాట్లాడుతూ ‘మా నాన్న గారి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రభాస్ గారి అసిస్టెంట్స్ మా ఇంటికి ఫోన్ చేశారు. వైద్యానికి ఎంత ఖర్చునైనా భరిస్తామని చెప్పారు. మా నాన్న గారి రెండు కిడ్నీలు చెడిపోయాయి అనే విషయాన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాను. అర్జెంటు గా దాతలను వెతుక్కోమని చెప్పారు. డాక్టర్లను సంప్రదించగా 50 లక్షల రూపాయిలు అవసరం ఉంటుందని చెప్పారు’ అంటూ ఆమె మీడియా కి చెప్పుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్ ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు రావడంతో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి త్వరలోనే మెరుగుపడుతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ చేసిన ఈ సాయం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత రెండు రోజులుగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి పై అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి.
కానీ ప్రభాస్ తప్ప ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. గతంలో ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు అందించారు. ఆర్ధిక సాయం కూడా బాగానే చేశారు, ఇక రీసెంట్ గానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ కి ఆర్ధిక సాయం అందించారు. అందరికంటే ముందు మెగా ఫ్యామిలీ ఫిష్ వెంకట్ కి సహాయం అందించింది కానీ , ఈసారి మాత్రం వాళ్ళ వైపు నుండి రియాక్షన్ రాలేదు. బహుశా ఈ విషయం వాళ్ళ వరకు వెళ్లి ఉండకపోయుండొచ్చు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రౌడీ గ్యాంగ్ లో ఒకరిగా, కమెడియన్ గా నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగానే చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయన తొందరగా కోలుకొని ఎప్పటిలాగానే మళ్ళీ సినిమాలను చెయ్యాలని ఆశిద్దాం.
ప్రభాస్ గారి మంచితనానికి మాటలు సరిపోవు. మనుషుల్ని, మనసులను గౌరవించే ఆయన సహాయసిద్ధత నిజంగా హృద్యంగా ఉంది. ఫిష్ వెంకట్ గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ఉదారహృదయంతో నిలిచే ప్రభాస్ గారిలాంటి వారు ఇండస్ట్రీకి గర్వకారణం. #Prabhas #rebelstar pic.twitter.com/4oPjBatBYq
— (@vignesh__9) July 4, 2025