Mudragada : కుమార్తెకు పోస్ట్ ఇచ్చి తండ్రి ముద్రగడను చావుదెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్

ఈ ఎన్నికల్లో పవన్ ఓడిపోవాలని బలంగా కోరుకున్న వారిలో ముద్రగడ ఒకరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. కానీ ఆయన శపధం నెరవేరలేదు. ఇప్పుడు ఆయన కుమార్తె విభేదించి జనసేనలో చేరేందుకు ముందుకు రావడం విశేషం.

Written By: NARESH, Updated On : October 19, 2024 8:12 pm

Pawan Kalyan

Follow us on

Mudragada : కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు షాక్ ఇచ్చారు ఆయన కుమార్తె. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో పవన్ ఓటమికి ముద్రగడ పద్మనాభం ఎంతగానో ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు. పిఠాపురం నుంచి 70 వేల మెజారిటీతో గెలిచారు పవన్. ఆయన గెలుపును అడ్డుకోలేకపోయారు ముద్రగడ. అయితే పిఠాపురం నుంచి పవన్ ఓడిపోతారని జోష్యం చెప్పారు ముద్రగడ. అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటాను అని కూడా సవాల్ చేశారు. అయితే అనూహ్యంగా ముద్రగడ కుమార్తె క్రాంతి తెరపైకి వచ్చారు. తండ్రి నిర్ణయానికి విరుద్ధంగా పవన్ కు మద్దతు తెలిపారు. ఆయనను గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పట్లో జనసేనలో చేరుతానని ఆమె ముందుకు రాగా వద్దని వారించారు పవన్. అయితే పచ్చని తన కుటుంబంలో పవన్ చిచ్చు పెట్టారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత కొంతకాలంగా పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు ముద్రగడ. ఇటువంటి తరుణంలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలో చేరతానని ప్రకటించడం విశేషం. దీంతో మరోసారి ముద్రగడ అంశం తెరపైకి వచ్చింది.

* కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత
ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే 2009లో ఓటమి ఎదురయ్యేసరికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. 2014లో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో కాపులను బీసీల జాబితాలో చేర్చుతానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో.. తక్షణం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ బాట పట్టారు ముద్రగడ. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో వైసీపీకి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారి తీయడంతో కేసులు సైతం నమోదయ్యాయి. తర్వాత చంద్రబాబు కాపులకు ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించారు. అయినా సరే చంద్రబాబు విషయంలో ముద్రగడ వెనక్కి తగ్గలేదు. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో కాపుల ఆగ్రహానికి గురయ్యారు చంద్రబాబు.

* గత ఐదేళ్లుగా నోరు మెదపలే
అయితే ఐదేళ్ల వైసిపి పాలనలో కాపులకు దారుణంగా అన్యాయం జరిగింది. అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లను సైతం జగన్ రద్దు చేశారు. కాపులకు ఉద్దేశించి పెట్టిన పథకాలను సైతం నిలిపివేశారు. అప్పటివరకు ఉద్యమ బాట పట్టిన ముద్రగడ ఈ విషయంలో మౌనం దాల్చారు. దీంతో వైసిపి అనుకూల ముద్ర ముద్రగడ పై పడింది. అయితే ఎన్నికలకు ముందు జనసేనలో చేరాలని ముద్రగడ భావించారు. పవన్ నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ కోపంతో వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. కానీ అందులో సైతం విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్ కు భారీ విజయం దక్కింది. దీంతో శపధం చేసినట్లే తన పేరు మార్చుకున్నారు. తన రాజకీయ నిర్ణయాన్ని విభేదించిన కుమార్తె క్రాంతి అప్పట్లో జనసేనలో చేరుతానని ముందుకు వచ్చారు. పవన్ వారించడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మరోసారి జనసేనలో చేరతానని ప్రకటించారు. అయితే ముద్రగడ కుమార్తె క్రాంతికి నామినేటెడ్ పదవితో పాటు జనసేనలో కీలక పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది.