Chiranjeevi: చిరంజీవి మద్దతు.. వైసీపీ అక్రోషం.. విష ప్రచారం

మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు తెలిపినప్పుడు.. వైసీపీ శ్రేణులు ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. చిరంజీవి మావాడు అని చెప్పుకునేవి. సొంత తమ్ముడు పవన్ కంటే జగన్ పై అపారమైన ప్రేమ చిరంజీవికి ఉందని బాహటంగా చెప్పుకొచ్చేవారు.

Written By: Dharma, Updated On : April 22, 2024 9:35 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: వైసీపీకి మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ అయ్యారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడమే ఆయన చేసిన తప్పు. తనను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు నాయకులకు చిరంజీవి మద్దతు ఇచ్చారు. అందులో ఒకరు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు. ఆ ఇద్దరు నేతలు చిరంజీవికి సన్నిహితులే. ఆ సన్నిహితం మీద ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను చిరంజీవి కోరడం వైసీపీకి తప్పుగా కనిపించింది.అందుకే మెగాస్టార్ పై దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగుతున్నారు. వైసీపీ కీలక నేత సజ్జల అయితే సింగిల్ సింహమని జగన్ను అభివర్ణిస్తూ.. మిగతా వారిని వివిధ జంతువులతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇదే మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు తెలిపినప్పుడు.. వైసీపీ శ్రేణులు ఇంద్రుడు చంద్రుడు అంటూ ఆకాశానికి ఎత్తేశాయి. చిరంజీవి మావాడు అని చెప్పుకునేవి. సొంత తమ్ముడు పవన్ కంటే జగన్ పై అపారమైన ప్రేమ చిరంజీవికి ఉందని బాహటంగా చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు అదే చిరంజీవి తన సన్నిహితులు ఇద్దరికి మద్దతు తెలిపే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు . ఎవరు ఎవరికి మద్దతిస్తే వైసిపి కి వచ్చిన నష్టమేంటి? గత ఎన్నికల్లో వైసిపి చాలామంది సినీ నటుల మద్దతు తీసుకోలేదా? అది తప్పు కానప్పుడు.. చిరంజీవి చేసింది తప్పు ఎలా అవుతుంది. వై నాట్ 175 అని సౌండ్ చేస్తున్న వైసీపీకి ఆ భయం ఎందుకు?

సాధారణంగా రాజకీయాల అన్నాక విమర్శలు ఉంటాయి.ప్రతి విమర్శలు ఉంటాయి. వాటికి ఒక హద్దు ఉంటుంది. కానీ తమకు అనుకూలమైన విషయాల్లో ఒకలా.. ప్రతికూలత చూపే అంశాల్లో మరోలా వైసిపి వ్యవహరిస్తోంది. జగన్ సింహం సింగిల్ గా పోల్చుతున్న నేతలు.. ఇతర పార్టీలకు మద్దతిస్తున్న వారికి ఎందుకు కించపరచాలి. అది ముమ్మాటికి జగన్ ను కించపరిచినట్టే. అంటే ఓటమి భయం పట్టుకున్నట్టే. అయితే ఇదే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. పవన్ కళ్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి వైసీపీకి మద్దతు తెలిపినప్పుడు ఒకలా ఉన్నారని.. కానీ అదే చిరంజీవి సినీ పరిశ్రమ సమస్య కోసం వెళితే.. రహస్య కెమెరాలతో చిత్రీకరించి రాక్షసానందం పొందాలని పవన్ గుర్తు చేశారు. ఏ వ్యక్తికైనా వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఒకటి ఉంటుంది. అది తమకు అనుకూలంగా ఉండాలని కోరుకోవడం ముమ్మాటికీ తప్పిదమే. చిరంజీవి విషయంలో వైసిపి చేస్తున్న అతి ఆ పార్టీకి చేటు తేవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.