Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? ఒక వ్యూహం ప్రకారం మౌనంగా ఉన్నారా? అదే మేలని భావిస్తున్నారా? ప్రస్తుతానికి సైలెంట్ శ్రేయస్కరం అని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పవన్ నోరు తెరవడం లేదు. ఏ అంశంపై స్పందించిన దాఖలాలు లేవు. స్పందిస్తే రాజకీయంగా లాభం కంటే.. నష్టమే అన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. అందుకే వ్యూహాత్మకంగా సైలెన్స్ పాటిస్తున్నారు.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* నకిలీ మద్యం వ్యవహారం..
నకిలీ మద్యం వ్యవహారంపై పెద్ద దుమారమే నడిచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా( Chittoor district) తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీ నకిలీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోతుందని అంతా భావించారు. ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న తరుణంలో ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు సంచలన విషయాలు బయట పెట్టారు. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోత్సాహం ఉందని.. వైసిపి హయాంలో తయారు చేశామని ఆయన ఒక ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో యూటర్న్ తీసుకుంది. దర్యాప్తులో సైతం వైసీపీ కుట్ర కోణం ఉందని బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడి ఉంటే సంచలనంగా మారే అవకాశం ఉండేది.
* ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంపై..
మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం పై( government medical colleges issues ) గట్టిగానే పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసిపి హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే ఓ చోట కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ తరుణంలో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో సైతం దీనిపై చర్చ జరిగింది. ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అదే క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ సైతం ఉన్నారు. అయితే దీనిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి సంబంధించి ప్రజల నుంచి భిన్న స్పందన వస్తోంది. పాలసీ ప్రకారం ప్రైవేటు భాగస్వామ్యంతో వీలైనంత త్వరగా పనులు పూర్తవుతాయని ఎక్కువమంది భావిస్తున్నారు. అయితే అది ప్రభుత్వ లక్ష్యానికి దెబ్బతీసే విధానమని మరికొందరికి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఈ అంశంపై మాట్లాడలేదు.
* వైసీపీ కుతంత్రాలకు..
పవన్ కళ్యాణ్ మాట్లాడితే కార్నర్ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సిద్ధంగా ఉంది. అయితే వైసీపీ లేనిపోని ఆరోపణలను నిజనిర్ధారణ చేస్తే మంచి యంత్రాంగాన్ని కూటమి నియమించింది. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలన్న వారి ప్రయత్నాలు కూడా ఏమంత సక్సెస్ కావడం లేదు. అనవసరంగా వైసిపి పై మాట్లాడి వారికి హైప్ కల్పించడం ఎందుకని పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజులపాటు ఇదే వ్యూహంతో కొనసాగుతారని సమాచారం.