Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ ఎఫెక్ట్ : కూటమి సర్కార్ వరుస అరెస్ట్ ల వెనుక కారణం...

Pawan Kalyan: పవన్ ఎఫెక్ట్ : కూటమి సర్కార్ వరుస అరెస్ట్ ల వెనుక కారణం ఇదే

Pawan Kalyan: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోంది.పాలనతోపాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్.గత ప్రభుత్వం మాదిరిగా ప్రతికార రాజకీయాలకు దిగలేదు.పూర్తి సంయమనంతో వ్యవహరిస్తూ వస్తోంది.వైసిపి నేతల మాదిరిగా వ్యాఖ్యలు కూడా పెద్దగా వినిపించలేదు.అప్పట్లో కొందరు మంత్రుల మాటలు అభ్యంతరకరంగా ఉండేది. ప్రతి దానికి తిట్ల దండకం అందుకునేవారు. ప్రత్యర్థులపై బూతులతో దాడి చేసేవారు.కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది.అయితే ఈ తరుణంలో వైసీపీ సోషల్ మీడియా పాత పద్ధతిలోనే రెచ్చిపోయింది.తమకేం జరుగుతుందిలే అంటూ ఓ రేంజ్ లో కూటమి సర్కార్ పై విరుచుకుపడింది. చివరికి ఇంట్లో మహిళలని చూడకుండా అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాను నింపేసింది.ప్రశ్నించడం అంటే ఇంట్లో ఆడవాళ్లను బూతులు తిట్టడమే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కూటమి నేతలకు అసహనానికి గురిచేసింది. హోం మంత్రిత్వ శాఖ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి అరెస్టుల పర్వం ప్రారంభం అయ్యింది. వాస్తవానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు ఇంకా పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పెడితే పర్వాలేదు కానీ.. అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఎప్పటికే మూడు నాలుగు సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. వారి దాడి తగ్గించకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. అయితే కడపలో వర్రా రవీందర్ రెడ్డిఅనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఎంపీ అవినాష్ రెడ్డిఆదేశాలతో వదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు. ప్రభుత్వం సీరియస్ అయ్యింది ఈ ఘటనపై.

* అప్పట్లో ఇలా కాదు
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు ప్రత్యర్థులు విరుచుకుపడేవారు. తిట్ల దండకాన్ని అందుకునేవారు. వైసీపీ యాక్టివిస్టులు కౌంటర్ ఇచ్చేవారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. వారు ఇట్టే వాలిపోయి అరెస్టులు కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టిడిపి శ్రేణులు సైతం లైట్ తీసుకున్నాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల పని అయిపోయిందని భావించాయి. కానీ అధినేత జగన్ నేరుగా ఆదేశాలు ఇచ్చేసరికి సోషల్ మీడియా విస్తృతం అయింది. టిడిపి కూటమి ఏం చేయలేదులే అన్న భరోసా ఇవ్వడంతో వారు రెచ్చిపోతున్నారు. పోలీసులు సైతం పాత పరిచయాల దృష్ట్యా చూసి చూడనట్టుగా విడిచి పెడుతుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఏకంగా ఈ విషయంలో పోలీసులే మూల్యం చెల్లించే దాకా పరిస్థితి వచ్చింది.

* అంతా ఫేక్ న్యూస్
ఏపీలో జరుగుతున్న ప్రతి అంశం పైన ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేశారు. మంత్రులు సైతం ఖండించినా వారు వినలేదు.అదే పనిగా ప్రచారం చేస్తూ వచ్చారు.ఫేక్ పోస్టులపై అనేక సార్లు ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు పంపింది. అయినా సరే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసి తీసుకుపోయేవారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా టిడిపి అదే పని చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని.. సహనానికి ఒక హద్దు ఉంటుందని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular