Pawan Kalyan CM rumors: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) నాలుగు రోజుల ముఖ్యమంత్రి పదవి నిజమేనా? సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తుండడంతో ఆయన బాధ్యతలు తీసుకుంటారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. అందులో ఎంత మాత్రం నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 26న నాలుగు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్ళనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయాధికారులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు ఉంటారు. అయితే నాలుగు రోజులు సీఎం చంద్రబాబు లేకపోవడంతో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్.. సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం సాగింది. గత కొద్ది రోజులుగా దీనిపైనే పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతోంది.
Also Read: ఈ ఐదుగురు జర్నలిస్టులపై పడిపోతున్నారు
కేవలం రాజకీయ హోదా..
అయితే డిప్యూటీ సీఎం అనేది ఒక హోదా మాత్రమే. దానికంటూ ప్రత్యేక విధులు, హక్కులు ఉండవు. సాధారణంగా రాష్ట్ర జనాభా, అసెంబ్లీ సీట్లు ప్రామాణికంగా మంత్రి పదవులు ఉంటాయి. ప్రస్తుతానికి ఏపీ క్యాబినెట్లో ( Ap cabinet) 25 మంది మంత్రులు మాత్రమే ఉండాలి. చంద్రబాబు మాత్రం 24 మందిని తన క్యాబినెట్లో తీసుకున్నారు. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంది. ప్రధాన మిత్రపక్షంగా జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలకపాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. అందుకే ఆయనకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. నాలుగు మంత్రిత్వ శాఖల తో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. అందరూ మంత్రులతో ఆయన సమానమే. కానీ హోదా విషయంలో మాత్రం ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.
Also Read: నియోజకవర్గాల పునర్విభజన..’జనసేన’కు భలే ఛాన్స్!
చంద్రబాబు అభిమానం..
అయితే ఆది నుంచి పవన్ కళ్యాణ్ విషయంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu)ప్రత్యేక చొరవ చూపుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ అత్యంత క్లిష్ట సమయంలో నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేరుగా టిడిపి తో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బిజెపిని సైతం కూటమిలోకి తెస్తానని చెప్పుకొచ్చారు. అలా అన్న మాదిరిగానే చేసి చూపించారు. కూటమిని అధికారంలోకి తీసుకు రాగలిగారు. దీంతో పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబుకు మరింత అభిమానం పెరిగింది. ఆయనకు మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలలో పవన్ కళ్యాణ్ కు సైతం భాగస్వామ్యం కల్పిస్తూ వచ్చారు చంద్రబాబు. అయితే చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇన్చార్జిగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఏడాది కాలంలో చంద్రబాబు చాలాసార్లు విదేశీ పర్యటనకు వెళ్లారు. కానీ ఎప్పుడూ అలా జరగలేదు. తాజాగా చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ఆ సమయంలో ఇన్చార్జ్ సీఎంగా పవన్ ఉంటారంటూ కొత్త ప్రచారం జరిగింది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.