Pawan Kalyan Amit Shah meeting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ముఖ్యంగా రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తేజ్ ను కలిశారు. పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి. మరోవైపు హోం మంత్రి అమిత్ షాను సైతం పవన్ కళ్యాణ్ కలిశారు. సాధారణంగా అమిత్ షా తో రాజకీయపరమైన చర్చలు జరిగి ఉంటాయి. ఎందుకంటే ఆయనే బిజెపిలో సుప్రీం. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకునేది ఆయనే. అందుకే ఆయన ఎదుట పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.
కూటమి పార్టీల మధ్య బంధం..
ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమిలో బిజెపితో పాటు జనసేన ఉంది. కేంద్రంలోని ఎన్డీఏలో టిడిపి తో పాటు జనసేన కీలక భాగస్వామిగా ఉన్నాయి. మూడు పార్టీలు మరో 15 ఏళ్ల పాటు సమన్వయంతో ముందుకు సాగాలన్న నిర్ణయంతో ఉన్నాయి. అయితే పరస్పర రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిపినట్లు తెలుస్తోంది. కూటమిపరంగా తీసుకోవాల్సిన అంశాలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో వ్యవహరించాల్సిన తీరు వంటి వాటిపై అమిత్ షా తో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లు అర్థం అవుతోంది. ఆ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాలపై చర్చలు జరిపారని తెలుస్తోంది.
నలుగురి పదవీ విరమణ..
ప్రధానంగా ఏపీలో రాజ్యసభ పదవులపై అమిత్ షా తో( Amit Shah ) పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. జూన్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని, టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. దానిపై చర్చించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేశారు. అందులో రెండు పదవులను బిజెపి దక్కించుకుంది. మరో రెండు పదవులను టిడిపి సొంతం చేసుకుంది. జనసేనకు చాన్స్ రాలేదు. అది అడిగేందుకే పవన్ ఢిల్లీ బాట పట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
రాజ్యసభ పదవి కోసమే..
అయితే ఈసారి బిజెపి మూడు రాజ్యసభ పదవులు కోరుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోసారి పారిశ్రామిక వర్గాల నుంచి పరిమళ్ నత్వానికి రాజ్యసభ పదవి ఇవ్వాలని కేంద్ర పెద్దలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ నుంచి పదవీ విరమణ చేయనున్న సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మిగతా రెండు రాజ్యసభ పదవులను సైతం తమకే విడిచి పెట్టాలని బిజెపి ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే మరోసారి జనసేనకు చాన్స్ లేకుండా పోతుంది. చంద్రబాబును అడిగితే బిజెపి పెద్దలు కోరిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిసి జనసేనకు ఒక రాజ్యసభ పదవి కోరినట్లు ప్రచారం నడుస్తోంది. అంటే బిజెపి కి రెండు.. టిడిపి, జనసేనకు చెరో పదవి దక్కనుందన్నమాట.