Actors turned Heroes: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లు కొంత మంది తమ ఫ్రెండ్స్ ని నటులుగా మార్చి వాళ్లకు గొప్ప అవకాశాలను ఇచ్చారు. వాళ్ళను స్టార్ పొజిషన్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ – సునీల్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఒకే రూమ్ లో ఉంటూ తిని, తినక పస్తులుండి మరి సినిమాల గురించి ఆలోచిస్తూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎట్టకేలకు సక్సెస్ లను సాధించారు… మొదట త్రివిక్రమ్ కి రైటర్ కి అవకాశం రావడంతో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్లలో సునీల్ ను ఇన్వాల్వ్ చేస్తూ అతని కామెడీని వాడుకుంటూ కొన్ని కామెడీ డైలాగులైతే రాసేవాడు.
దానివల్ల సునీల్ సైతం ఎలివేట్ అయ్యాడు. మొత్తానికైతే ఇటు త్రివిక్రమ్ రైటర్ గా, డైరెక్టర్ గా సక్సెస్ ని సాధిస్తే సునీల్ నటుడిగా రాణించాడనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించి పెడుతున్నాయి. సునీల్ ఒక దశలో హీరోగా మారి పలు సినిమాలు చేశాడు. అందులో కొన్ని సక్సెస్ సాధిస్తే, మరికొన్ని ప్లాప్ అయ్యాయి…
కృష్ణవంశీ – బ్రహ్మాజీ లు కూడా మంచి ఫ్రెండ్స్…కెరియర్ స్టార్టింగ్లో కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు బ్రహ్మాజీ సినిమా అవకాశాల కోసం తిరిగేవాడు. అలా కృష్ణవంశీ కలిశాడు. ఒక రోజు కృష్ణవంశీ విపరీతంగా ఆకలితో ఉన్నప్పుడు బ్రహ్మాజీ తనకు భోజనం పెట్టించాడు. దాంతో అప్పటినుంచి వాళ్ళిద్దరూ ఇంకా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.
ఇక ఆ కృతజ్ఞత భావాన్ని మనసులో పెట్టుకొని తను చేసిన ‘సింధూరం’ సినిమాలో బ్రహ్మాజీని హీరోగా పెట్టి మరి సినిమా చేశాడు. మొత్తానికి తనని హీరో చేశాడు. ఆ తర్వాత బ్రహ్మాజీ పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికి పూర్తిస్థాయి హీరోగా మారలేకపోయాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయిపోయాడు… ప్రస్తుతం నటుడిగా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు…స్టార్ హీరోల సినిమాల్లో డిఫరెంట్ పాత్రలను చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు…