Deputy CM Pavan Kalyan : పిఠాపురం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తనను గెలిపిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానని పవన్ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పిఠాపురం పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు పవన్. ప్రస్తుతం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన కీలకమైన నాలుగు మంత్రిత్వ శాఖలను కూడా నిర్వర్తిస్తున్నారు. ఈ తరుణంలో పాలనాపరమైన అంశాల్లో బిజీగా ఉన్నారు పవన్. అయితే తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం విషయంలో మాత్రం ప్రత్యేక దృష్టితో ఉన్నారు. అందుకే అక్కడ సమస్యల అధ్యయనానికిఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.నియోజకవర్గ పరిధిలోని 52పంచాయితీలతో పాటు రెండు మున్సిపాలిటీల్లో సమస్యలను గుర్తించేందుకుగాను ప్రత్యేక బృందాలను నియమించారు. వారు ఆయా గ్రామాల్లో సమస్యలు గుర్తించి.. పవన్ కళ్యాణ్ కు నివేదించనున్నారు. అందుకు అనుగుణంగా పవన్ అభివృద్ధికి బాటలు వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర డిప్యూటీ సీఎం గా తన మార్కును ప్రదర్శిస్తున్నారు పవన్. ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సాగిన గ్రామ సభల్లో ప్రజలకు ఉపయోగపడే పనులను గుర్తించగలిగారు. వాటికి ₹4,500 కోట్ల రూపాయలను సమకూర్చగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల పనులకు ఈనెల 14న శ్రీకారం చుట్టనున్నారు. ఇది పవన్ రాజకీయ ప్రయాణంలో కీలక నిర్ణయమే.
* తిరస్కరించిన ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు
2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్. సొంత నియోజకవర్గ భీమవరం తో పాటు విశాఖలోని గాజువాక నుంచి బరిలో దిగారు. అయితే రెండు చోట్ల పవన్ కు నిరాశే ఎదురైంది. రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డారు. ప్రత్యర్ధులు చులకన చేసి మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ ను గుండెల్లో పెట్టుకున్నారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు. ఏకంగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. అందుకే పిఠాపురం నియోజకవర్గం పై ఎనలేని అభిమానంతో కొనసాగుతున్నారు పవన్. రాష్ట్రంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానన్న హామీని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.
* విలువైన సమయం సొంత నియోజకవర్గానికి..
అయితే ఎన్నికలకు ముందే కాదు.. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా పవన్ పిఠాపురం పై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఒక రాష్ట్ర మంత్రిగా పాలనలో బిజీగా ఉన్నా..విలువైన సమయాన్ని పిఠాపురం నియోజకవర్గానికి కేటాయిస్తున్నారు. పవన్ ప్రాతినిధ్యం వహించిన తర్వాతే పిఠాపురంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అటు మెగా కుటుంబం సైతం తమ పండుగను, సరదాలను పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పంచుకోవడం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. తన రాజకీయ ఉన్నతికి, ఎన్నో అవమానాలకు చెక్ చెప్పేందుకు దోహదపడిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల విషయంలో.. చివరి వరకు ఇలానే ఉంటానని పవన్ చెబుతుంటారు. మొత్తానికి అయితే పవన్ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో సరికొత్త అడుగులు పడుతుండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan has fielded special teams for the development of pithapuram
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com