Hanuma Vihari: జగన్ ప్రభుత్వం ఓడింది.. హనుమ విహారి చేతికి ఎన్వోసీ వచ్చింది.. ట్వీట్ వైరల్

అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెలుగు క్రికెటర్ హనుమ విహారిని విపరీతమైన ఇబ్బంది పెట్టింది. దీంతో అతడు చాలా చికాకులు ఎదుర్కొన్నాడు. ఇది రాజకీయరంగు పులుముకోవడంతో చర్చకు దారి తీసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 4, 2024 7:02 pm

Hanuma Vihari

Follow us on

Hanuma Vihari: ఏపీలో జగన్ ప్రభుత్వం దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం నేపథ్యంలో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇందులోకి అనూహ్యంగా ఒక క్రికెటర్ చేరాడు.. తన ఆనందాన్ని మరో విధంగా లోకానికి చాటి చెప్పాడు. ఇంతకీ కూటమి విజయ సాధిస్తే ఆ క్రికెటర్ కు ఏంటి సంబంధం? ట్విట్టర్లో అతడు చేసిన ట్వీట్ దేనికి నిదర్శనం? ఈ కథనంలో తెలుసుకుందాం..

అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెలుగు క్రికెటర్ హనుమ విహారిని విపరీతమైన ఇబ్బంది పెట్టింది. దీంతో అతడు చాలా చికాకులు ఎదుర్కొన్నాడు. ఇది రాజకీయరంగు పులుముకోవడంతో చర్చకు దారి తీసింది. అయితే అప్పట్లో వైసీపీ పెద్దలు ఆంధ్ర క్రికెట్ బోర్డును శాసిస్తున్న నేపథ్యంలో హనుమ విహారి వేదన అరణ్యరోదన అయింది. దీంతో అతడు మధ్య క్రికెట్ మారడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇలా ఒక క్రికెటర్ వేరే బోర్డు కు వెళ్లాలంటే కచ్చితంగా తన మాతృ బోర్డు ఎన్ఓసి ఇవ్వాలి. ఈబిఎన్ఓసి కోసం హనుమ విహారి రెండు నెలలుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అసోసియేషన్ పెద్దలు అతడి విన్నపాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం మారడం.. హఠాత్తుగా హనుమ విహారికి ఎన్వోసీ జారీ అయింది. ఇదే విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.. మంగళవారం ఎన్నికల ఫలితాలు విడుదల కావడం.. వైసిపి దారుణంగా ఓడిపోవడంతో హనుమ విహారి వరుసగా ట్వీట్లు చేశాడు..

హనుమ విహారికి సంబంధించిన ఎన్వోసీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం సిద్ధం చేసింది. ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత మెయిల్ చేసేది.” నిరభ్యంతర పత్రం ఇవ్వాలని గత కొద్దిరోజులుగా నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పటికీ రెండు నెలల కాలం పూర్తయింది. ఏకంగా నాలుగు సార్లు మెయిల్స్ చేశాను. నా విన్నపాన్ని వారు పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా సోమవారం ఎన్వోసీ సిద్ధం చేశారు. మంగళవారం రాష్ట్రంలో పరిస్థితులు మారాయి. నాకు వెంటనే జారీ చేశారని” హనుమ విహారి పేర్కొన్నాడు. తన మెయిల్ స్క్రీన్ షాట్, లెటర్ ను హనుమ విహారి తన ట్వీట్ కు జోడించాడు.

ఇక మరో ట్వీట్ లో తన ఎన్వోసిని ఒకరోజు ముందుగానే సిద్ధం చేసి.. ఎన్నికల ఫలితాల తర్వాత పంపించాలని వివరించాడు.. ఏపీలో కూటమి అధికారాన్ని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు హనుమ విహారి.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.. ” పదేళ్లపాటు కష్టం.. అద్భుతమైన పట్టుదల.. కట్టుదిట్టమైన ప్రణాళిక.. ఇప్పుడు కళ్ళ ముందుకు పవర్.. అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ కు శుభాకాంక్షలని” హనుమ పేర్కొన్నాడు. ఇక 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో.. కూటమి అభ్యర్థులు అత్యంత భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు.