AP Deputy CM Pavan Kalyan : జనసేన అధినేత పవన్ ప్రభావం దేశవ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఆయన ఒక రోల్ మోడల్ గా కనిపిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ నటులు పవన్ కళ్యాణ్ ను కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా విలక్షణ నటుడు షియాజీ షిండే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ను షిండే కలిశారు. కీలక చర్చలు జరిపారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షకు మద్దతు తెలిపారు. ఆలయాల్లో దేవుడి దర్శనం చేసుకునే భక్తులకు మొక్కలు ఇవ్వాలన్న ప్రతిపాదన పెట్టారు. మహారాష్ట్రలో తాను ఓ 3 ఆలయాల్లో అదేవిధంగా మొక్కలు అందించిన విషయాన్ని పవన్ కు తెలియజేశారు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించారు. పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అంశాన్ని వ్యతిరేకించారు మరో నటుడు ప్రకాష్ రాజ్. కానీ షిండే మాత్రం ఆహ్వానించారు. నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. అయితే పవన్ ను కలిసిన తర్వాత.. ఆయన నేషనల్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. మహారాష్ట్రలో శివసేన- ఎన్సిపి- బిజెపి భాగస్వామ్య ప్రభుత్వం నడుస్తోంది. ఈ క్రమంలో బిజెపి భాగస్వామ్య పార్టీ అయినా ఎన్సీపీలో షిండే చేరడం వెనుక పవన్ ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే పవన్ నందమూరి తారక రామారావును గుర్తు చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్
సినీ రంగంలో ఉన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు.కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రాగలిగారు.దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్న ఏపీని తెలుగుదేశం పార్టీ హస్తగతం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా మారింది. వ్యాప్తంగా ఉన్న అనేక చిత్ర పరిశ్రమలకు ఎన్టీఆర్ ఆదర్శంగా మారారు. తమ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ సాధించిన ఎన్టీఆర్ ను అన్ని చిత్ర పరిశ్రమలు మనస్ఫూర్తిగా అభినందించాయి. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది సినీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. మరికొందరు రాజకీయ పార్టీలు స్థాపించారు. కానీ ఎన్టీఆర్ స్థాయిలో రాణించలేకపోయారు.
* పవన్ లో అదే గుణం
తమిళనాడులో సైతం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయాల్లో రాణించడం సర్వసాధారణం. అయితే ఏపీలో మాత్రం ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతోమంది నటులు రాజకీయాల్లోకి వచ్చి పదవులు చేపట్టారు. ప్రజాసేవ కోసం ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించేవారు ఎన్టీఆర్. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ లో కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన విజయం సాధించింది. శత శాతం విక్టరీతో అందరినీ ఆకర్షించగలిగారు. అందుకే దేశం యావత్తు చిత్ర పరిశ్రమలకు చెందిన వ్యక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వారంతా పవన్ ను కలిసేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే షియాజి షిండే పవన్ ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ తరువాత దేశవ్యాప్తంగా ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ ముందంజలో ఉండడం విశేషం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ntr and pawan kalyan are seen as role models for those entering politics from the film industry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com