Homeఆంధ్రప్రదేశ్‌Anganwadi Recruitment:సర్కార్ గుడ్ న్యూస్.. పది పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం మీదే

Anganwadi Recruitment:సర్కార్ గుడ్ న్యూస్.. పది పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం మీదే

Anganwadi Recruitment:అన్నమయ్య జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా….జిల్లాలో ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మదనపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె బాలసదనాలకు మంజూరైన పోస్టులకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఈ పోస్టుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఒకటి ఆఫీస్ ఇన్‌చార్జ్ పోస్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ముగ్గురు వంట మనుషుల ఖాళీలను, ఒక హెల్పర్, రెండు హౌస్ కీపింగ్ పోస్టులు, రెండు ఎడ్యుకేటర్ పోస్టులు, రెండు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల పోస్టులు, మూడు ఇన్‌స్ట్రక్టర్లు, యోగా టీచర్ పోస్టులు, ముగ్గురు హెల్పర్ లేదా నైట్ వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ముఖ్య సమాచారం :
మొత్తం అంగ‌న్‌వాడీ పోస్టుల సంఖ్య : ఒక ఆఫీస్ ఇన్‌చార్జ్ పోస్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ముగ్గురు వంట మనుషులు, ఒక హెల్పర్, రెండు హౌస్ కీపింగ్ పోస్టులు, రెండు ఎడ్యుకేటర్, రెండు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, మూడు ఇన్‌స్ట్రక్టర్లు, యోగా టీచర్ పోస్టులు, ముగ్గురు హెల్పర్ లేదా నైట్ వాచ్‌మెన్ పోస్టులు
అర్హతలు : ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత అయి ఉండాలి. స్థానిక ప్రాంత ప‌రిధికి చెందిన వారై అయి ఉండాలి.
వయ‌స్సు : దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్న అభ్యర్థి వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
దర‌ఖాస్తులు ప్రారంభం తేదీ : నేటి నుంచే
ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి చివ‌రి తేదీ : డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు.
గౌర‌వ వేత‌నం : అంగ‌న్ వాడీ వ‌ర్కర్‌కు రూ.11,500, మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్కర్‌కు రూ.7 వేలు, అంగ‌న్‌వాడీ హెల్పర్‌కు రూ.7వేలు ఉంటుంది.
ఎంపిక విధానం : ఎలాంటి రాత ప‌రీక్ష ఉండ‌దు. ఇంట‌ర్వ్యూ మాత్రం నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి కనబరిచిన ప్రతిభా ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అప్లికేష‌న్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం : పోస్టుల దరఖాస్తు చేసుకునేందుకు అర్హతా వివరాలను అధికారిక వెబ్ సైట్ http://annamayya.ap.gov.in నుంచి పొందాలని సూచించారు. అన్ని అర్హతలున్న మహిళా అభ్యర్థులు మాత్రమే పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జతపరిచి 13వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సుండుపల్లె మార్గంలో కేటీసీ ఫంక్షన్ హాలు ఎదురుగా గల ఐసీడీఎస్ పీడీ ఆఫీసులో అందజేయాలన్నారు. ఇంకా వివరాలకు తమ ఆఫీసులో సంప్రదించాలని ఆమె సూచించారు. అలాగే స్థానిక వాసులే కావాలి, పెళ్లి చేసుకుని ఈ ఊరి కోడలై ఉండాలి. ఎక్కడ పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన వారై ఉండాలని ఆమె సూచించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version