AP School Uniform: ప్రభుత్వ పాఠశాలల్లో( Government schools) చదువుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారు ధరించే యూనిఫారం మారనుంది. కొత్త యూనిఫామ్ డిజైన్లు ఖరారు అయ్యాయి. జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కొత్త యూనిఫామ్ లకు మంత్రి నారా లోకేష్ ఆమోదం తెలిపారు.
Also Read: బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్
* అప్పట్లో పార్టీ రంగులు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో విద్యార్థుల యూనిఫారాలకు సంబంధించి పార్టీ రంగులు ఉండడం విమర్శలకు తావిచ్చింది. గతంలో జగనన్న విద్యా కానుక కిట్ల పేరిట వీటిని అందించేవారు. గత ఏడాది జూన్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికే జగనన్న విద్య కానుక కిట్ల పేరిట పాఠశాలలకు సరఫరా చేశారు. అయితే అప్పట్లో కూటమి ప్రభుత్వం వాటిలో ఎటువంటి మార్పు చేయలేదు. కానీ ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పేరిట యూనిఫామ్ అందించనున్నారు. బెల్టులతో పాటు బ్యాగులను సైతం అందించనున్నారు. గతంలో విద్యా కానుక అని రాయిగా.. ఈసారి మాత్రం ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ముద్రించనున్నారు.
* మారనున్న రంగులు
స్కూల్ బ్యాగులు( school bags ) రంగులు మారనున్నాయి. లేత ఆకుపచ్చ రంగులో బ్యాగులు ఉండనున్నాయి. ఈ కిట్లను జూన్ 12 నాటికి.. పాఠశాలలు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంకోవైపు ఈ యూనిఫామ్ కుట్టే కూలీని కూడా ప్రభుత్వం ఎప్పటికీ ఖరారు చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 120.. 9, 10వ తరగతి వారికి రూ. 240 చెల్లించనున్నారు.
* సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్( Sarvepalli Radhakrishnan vidyadhi Mitra kit ) పేరిట దీనిని అందించనున్నారు. ఈ కిట్ లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, డిక్షనరీ, బెల్ట్, షూష్, బ్యాగు, మూడు జతల యూనిఫామ్ ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కిట్ల నాణ్యత పై విమర్శలు ఉన్నాయి. దీంతో ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాణ్యమైన కిట్లు అందించేందుకు నిర్ణయించారు.
Also Read: ప్రజల చేతిలో ప్రభుత్వం.. ఏపీ ప్రభుత్వం మరో గొప్ప ముందడుగు