మద్దతు ధరపై హామీ ఇస్తాం..: రైతులకు కేంద్ర మంత్రి లేఖ

కేంద్ర సర్కార్‌‌ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విప్లవాత్మక సంస్కరణలు అంటూ మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలపై యుద్ధం చేస్తూనే ఉన్నారు రైతులు. హస్తిన కేంద్రంగా రైతులు తమ ఉద్యమ గళాన్ని వినిపిస్తున్నారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారంతో 22వ రోజుకు చేరాయి. మరోవైపు ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు -కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్ […]

Written By: Srinivas, Updated On : December 19, 2020 3:29 pm
Follow us on


కేంద్ర సర్కార్‌‌ కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విప్లవాత్మక సంస్కరణలు అంటూ మోడీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాలపై యుద్ధం చేస్తూనే ఉన్నారు రైతులు. హస్తిన కేంద్రంగా రైతులు తమ ఉద్యమ గళాన్ని వినిపిస్తున్నారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు గురువారంతో 22వ రోజుకు చేరాయి. మరోవైపు ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు -కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌తోమర్ కీలక అడుగు వేశారు.

Also Read: ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు

ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గురువారం రాత్రి రైతులకు బహిరంగ లేఖ రాశారు. మొత్తం ఎనిమిది పేజీలతో కూడిన ఆ లేఖలో.. రైతుల నిరసనల వల్ల అనేక సమస్యలు తలెత్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నిరసనలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే, కొత్తగా పలు రకాల హామీలను సైతం తోమర్ తన లేఖలో చెప్పుకొచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై కొన్ని పార్టీలు, యూనియన్లకు చెందిన వ్యక్తులు పెద్ద ఎత్తున అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, రైతులెవరూ వాటిని నమ్మొద్దంటూ మంత్రి విజ్ణప్తి చేశారు. ఎంఎస్‌పీపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని అందులో పేర్కొన్నారు.

‘కొన్ని రైతు సంఘాలు తప్పుడు ప్రచారం, రూమర్లను ప్రచారం చేస్తున్నాయి. అలాంటి వారిని బయటికి పంపడం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను ఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుకు చేరుకోలేకపోతున్నారు’ అని రైతులకు రాసిన లేఖలో తోమర్ పేర్కొన్నారు.

Also Read: మూడు డిగ్రీలో చలిలోనూ కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..!

అయితే.. ఎంఎస్‌పీ హామీని కేంద్రం ముందు నుంచే చెబుతూ వస్తున్నా రైతులు మాత్రం అంగీకరించడం లేదు. వ్యవసాయ చట్టాలను పూర్తిస్థాయిలో వెనక్కి తీసుకోవాలనేదే వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. నిరసనల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని కేంద్రం అంటుండగా, సుప్రీంకోర్టు మాత్రం నిరసనలు తెలిపే హక్కు రైతులకు ఉందని చెప్పడం గమనార్హం. ప్రధాని మోడీ నిన్న అంతలా చేతులు జోడించి రైతులు ఆందోళనలు విరమించాలంటూ విజ్ఞప్తి చేసినా వినని రైతులు.. కేంద్ర మంత్రి లేఖను కూడా లైట్‌ తీసుకున్నారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్