Cigarettes New Taxes: వ్యసనం అనేది ఏడూర్ల ప్రయాణమట. ఈ సామెతకు తగ్గట్టుగానే సిగరెట్లు తాగేవారు.. వాటికోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారట. ధూమపానం వల్ల క్యాన్సర్ వస్తుందని.. ఇతర అనేక రకాల వ్యాధులు సోకుతాయని తెలిసినప్పటికీ చాలామంది..ఆ అలవాటును మానుకోలేరు. పైగా మరింత విచ్చలవిడిగా తాగుతుంటారు. ఇక నేటి కాలంలో యువత సిగరెట్లు తాగడాన్ని ఒక వ్యసనం లాగా మార్చుకుంది. యువకులు మాత్రమే కాదు, యువతులు కూడా సిగరెట్లు తాగుతూ ఉండడం ఆందోళన కలిగించే పరిణామం.
ధూమపానం అలవాటును క్రమేపీ దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పన్నులు పెంచుతూనే ఉంటుంది. పైగా మనదేశంలో ఈ స్థాయిలో పన్నులు విధిస్తున్నప్పటికీ సిగరెట్లు తాగే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశంలో.. సిగరెట్ల వాడకం కూడా విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిగరెట్ల మీద కొత్త పన్ను విధించింది. దీంతో భారతీయ ఎక్కువగా కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. ప్రభుత్వం పన్ను పెంచిన నేపథ్యంలో.. ఆ ప్రభావం కొంతమంది 100 మిలియన్ల ప్రజలపై చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనదేశంలో పొగాకు ఉత్పత్తులను తయారు చేయడంలో ఐటీసీ కంపెనీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ గోల్డ్ ఫ్లేక్ పేరుతో సీక్రెట్లను తయారు చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచిన నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ విలువ గురువారం దాదాపు 4.4 శాతం పడిపోయింది. మార్ల్ బోరో సిగరెట్లను మన దేశంలో విక్రయించే గాడ్ ఫ్రే ఫిలిప్స్ ఇండియా(GDFR. NS) కంపెనీ షేర్ల విలువ 7.7% తగ్గింది.
ఈ కథనం రాసే సమయం వరకు ఐటిసి కంపెనీ షేర్ విలువ 385.25 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది జూన్ 2024 తర్వాత ఆ కంపెనీ ఎదుర్కొంటున్న అత్యంత కనిష్ట స్థాయి. 2022 తర్వాత కూడా ఐటీసీ షేర్ ఇలానే డౌన్ అయింది. నిఫ్టీ ఇండెక్స్ లో ఐటిసి అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. అంతేకాదు ఫాస్ట్ మూవీ కన్జ్యూమర్ గూడ్స్ సూచికలో కూడా అత్యంత క్షీణతకు దారితీసింది. ఎఫ్ఎంసీజీలో 1.6% తక్కువగా ట్రేడ్ అవుతోంది అంటే.. కేంద్రం పెంచిన పన్నులు ఐటిసి కంపెనీ మీద ఏ స్థాయిలో ప్రభావం చూపించాయో అర్థం చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ పొడవును బట్టి వేయి స్టిక్ లకు 2,050 నుంచి 8500 రూపాయల ఎక్సైజ్ సుఖాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. దీనివల్ల ఒకసారిగా ఐటీసీ షేర్ తీవ్రంగా ప్రభావితమైంది. అంతేకాదు, లేబుల్ లో కూడా మార్పులు తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కంపెనీలకు సూచించింది. ఈ సుంకం వల్ల 75 నుంచి 85 ఎంఎం సిగరెట్ల మొత్తం ఖర్చులు 22 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు వెల్లడించారు.
“75 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న సిగరెట్లు ఐటిసి వ్యాల్యూలో దాదాపు 16% వాటాను కలిగి ఉన్నాయి. లెవీ ఫలితంగా ఒక్కోస్టిక్ కు రెండు నుంచి మూడు రూపాయల ధర పెరుగుతుంది. ప్రస్తుతం 40 శాతం విధిస్తున్న సేవల పన్నుకు అదనంగా మరో కొత్త పన్ను జమవుతుంది. సిగరెట్లు, పొగకు ఉత్పత్తులపై తాత్కాలిక లేని భర్తీ చేసే క్రమంలో భాగంగా సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును 2025 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈ ప్రకటన చేసింది. రిటైల్ ధరలపై సుంకం మార్పు ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయకపోయినప్పటికీ.. అధిక పన్నులు కంపెనీలు ధరలను పెంచే విధంగా ప్రేరేపించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం తాజాగా పెంచిన పన్ను ద్వారా ఇకపై తాము సిగరెట్లు తాగలేమని.. ధూమపాన ప్రియులు అంటున్నారు. సిగరెట్ తాగే వారి పరిస్థితి అలా ఉంటే.. పొగాకు ఉత్పత్తులు తయారుచేసే కంపెనీల పరిస్థితి మరో విధంగా ఉంది. కేంద్రం పన్నులు పెంచిన నేపథ్యంలో.. ధరలు పెంచాల్సిన అనివార్యత కంపెనీలకు ఏర్పడింది.