TDP Membership : తెలుగుదేశం పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. 73 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయడం రికార్డు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సారాధ్యంలో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా జట్టు స్పీడ్ తో ముందుకు సాగింది. పార్టీ స్థాపించిన 43 ఏళ్లలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ సమయంలోనే సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరగడం విశేషం. అక్టోబర్ 26న సభ్యత్వ నమోదు ప్రారంభం అయింది. ఈ స్వల్ప వ్యవధిలోనే 73 లక్షల సభ్యత్వ నమోదు జరగడం నిజంగా రికార్డ్ బ్రేక్. అధికారంతో సంబంధం లేకుండా తెలుగుజాతి ప్రయోజనాల కోసం 43 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్న పార్టీ తెలుగుదేశం. ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి జాతీయస్థాయిలో తమ ఉనికి చాటుకుంటుంది. అధునాతన విధానాలతో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది.
* గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోంది. లోకేష్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టంకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలతో పాటు క్షేత్రస్థాయిలో నాయకులు సభ్యత్వ నమోదు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 100 రూపాయల సభ్యత్వంతో గతంలో రెండు లక్షల రూపాయలు ఉన్న ప్రమాద బీమా ను ఐదు లక్షల రూపాయలకు పెంచారు. రిఫరల్ సిస్టంలో కష్టపడిన కార్యకర్తను నేరుగా గుర్తించే విధానం అమల్లోకి తేవడంతో క్యాడర్ ఉత్సాహంగా పనిచేస్తోంది.
* ఈ నియోజకవర్గాల్లో జెట్ స్పీడ్ లో..
రాష్ట్రంలో రాజంపేట, నెల్లూరు, కుప్పం, పాలకొల్లు, మంగళగిరి నియోజకవర్గాలు సభ్యత్వ నమోదులో అగ్రస్థానంలో నిలిచాయి. 73 లక్షల మంది సభ్యత్వ నమోదులో.. తెలంగాణ నుంచి 85000 మంది ఉన్నారు. సభ్యత్వ నమోదుపై ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసిన నేతలను అభినందించారు. కేడర్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు తో బలమైన టిడిపి ఆర్మీ ని తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి సంక్షేమ పథకాలతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీది ప్రత్యేక స్థానం.