Kadapa : కడపలో వైసీపీకి షాక్. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్ళనున్నారు. టిడిపిలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. ప్రధానంగా కడప కార్పొరేషన్ లోని ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం. వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్ ఇప్పటికే టిడిపి గూటికి చేరారు. మరో ఏడుగురు కార్పొరేటర్లు సైకిల్ ఎక్కేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరంతా సీఎం చంద్రబాబు సమక్షంలో సోమవారం టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. మీరు గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వైసిపి కార్పొరేటర్లు పార్టీని వీడనున్నారని సమాచారం రావడంతో ఎంపీ అవినాష్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. శనివారం సాయంత్రం వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. అయితే ఈ భేటీకి అసంతృప్త కార్పొరేటర్లు రానట్లు సమాచారం. దీంతో వీరు పార్టీ వీడుతారనే వార్తలకు బలం చేకూరింది.
* వైసీపీ ఏకపక్ష విజయం
కార్పొరేషన్ ఎన్నికల్లో కడప నగరపాలక సంస్థను వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. కలిసి ఇక్కడ టిడిపికి చోటు లేదు. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చింది. కడపలో వైసీపీ ఓడిపోయింది. దీంతో టీడీపీలోకి వలసలు ప్రారంభం అయ్యాయి. చాలాచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీలలో టిడిపి పాగా వేసింది. ఈ క్రమంలోనే రెండు నెలల కింద కడప కార్పొరేషన్ లోని 25 డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన బాటలోనే మరో ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇదే జరిగితే రానున్న రోజుల్లో మరింత మంది కార్పొరేటర్లు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫోకస్
కడప కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికల్లో 48 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. టిడిపికి ఒకటి, జనసేనకు ఒక డివిజన్ దక్కాయి. ఎన్నికల అనంతరం వైసిపి కార్పొరేటర్ ఒకరు టిడిపిలో చేరారు. ఇప్పుడు మరో ఏడుగురు చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్ లను టిడిపి గాలం వేస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మాధవి రెడ్డి చురుకుగా పావులు కదుపుతున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన కలవరం కనిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Seven corporators of kadapa corporation are ready to join the tdp party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com